ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు సోమవారం నాడు కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.
ఏపీ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గాను సుప్రీంకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా కూడ ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేశారు.
also read:బలవంతంగా ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దు: ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామ్ రెడ్డి
కరోనా వ్యాక్సినేషన్ పూర్తైన తర్వాత ఎన్నికల నిర్వహణకు గాను తాము సిద్దంగా ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల నిర్వహణ వల్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ మధ్యాహ్నం సుప్రీంకోర్టు తాజా నిర్ణయం నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సెక్రటరీకి ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశాడు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటించిన విషయాన్ని ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు.ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోనేందుకు అవకాశం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.