ఏపీకి మొండిచేయి: కేంద్ర బడ్జెట్ మీద విజయసాయి రెడ్డి ధ్వజం

By telugu teamFirst Published Feb 1, 2021, 1:53 PM IST
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రతిపాదించిన బడ్జెట్ మీద వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏపీకి బడ్జెట్ లో మొంజిచేయి చూపించారని ఆయన విమర్శించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ 2021పై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు మాత్రమే రాయితీలు ఇచ్చారని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లెమంటులో ప్రవేశపెట్టిన తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బడ్జెట్ లో పట్టించుకోలేదని ఆయన అన్నారు. 

ఏపీలో మెట్రో రైలు కోసం ఆరేళ్లుగా అడుగుతున్నామని, కానీ కేంద్రం పట్టించుకోలేదని ఆయన విమర్సించారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని ఆయన అన్నారు. కిసాన్ రైళ్ల కోసం విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పెద్గగా ఉపయోగం లేని కారిడార్ మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రానికి 4 వేల కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. 

ఏపీకి కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం తప్ప ఒరిగిందేమీ లేదని ఆయన అన్నారు. ఏపీకి ఆశించినంత మేర బడ్జెట్ లో ఇవ్వలేదని, ఇది దురదృష్టకరమైన విషయమని ఆయన అన్నారు. బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విమర్సించారు. ఇది అస్సాం, తమిళనాడు, కేరళ బడ్జెట్ మాదిరిగా ఉందని, మిగతా రాష్ట్రాలకు ఈ బడ్జెట్ వర్తించదేమో అనే అనుమానం కలుగుతోందని విజయసాయి రెడ్డి అన్నారు. 

బడ్జెట్ నిరాశజనకంగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి అత్యధిక నిధులు వచ్చేలా కృషి చేస్తామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదని, అదే విధంగా రాష్ట్ర విభజన చట్టం హామీల ప్రస్తావన కూడా లేదని ఆయన అన్నారు. ఇది అసంతృప్తికరమైన బడ్జెట్ అని ఆయన అన్నారు

click me!