గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సోమవారం నాడు రాత్రి లేఖ రాశాడు.
అమరావతి: గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సోమవారం నాడు రాత్రి లేఖ రాశాడు.
ఈ ఇద్దరు కలెక్టర్లతో పాటు మరికొందరు పోలీసు అధికారులను కూడ బదిలీ చేయాలని ఆ లేఖలో ఎస్ఈసీ ఆదేశించారు. గత ఏడాది మార్చిలోనే గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆదేశించింది.
రెండు రోజుల క్రితం కూడ ఇదే విషయమై ఎస్ఈసీ ఆదేశించింది. మరోసారి ఇదే విషయమై ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.తిరుపతి అర్బన్ ఎస్పీ, శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలు నలుగురు సీఐలను వెంటనే బదిలీ చేయాలని లేఖ రాశారు ఎస్ఈసీ.
మాచర్ల, పుంగనూరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను కూడ బదిలీ చేయాలని ఎస్ఈసీ ఆ లేఖలో కోరారు.గత వారం రోజుల క్రితం జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల ఏర్పాట్ల విషయమై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదులుగా ఆ జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఎస్ఈసీ చర్చించారు.