స్థానిక సంస్థల ఎన్నికలు: ఫిర్యాదుల కోసం ఈ-వాచ్ యాప్ ఆవిష్కరించిన నిమ్మగడ్డ

By narsimha lodeFirst Published Feb 3, 2021, 11:40 AM IST
Highlights

 రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఈ-వాచ్ యాప్ ను  ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసింది. ఈ యాప్ ను ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఆవిష్కరించారు.

విజయవాడ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదులు చేసేందుకు ఈ-వాచ్ యాప్ ను  ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం తయారు చేసింది. ఈ యాప్ ను ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు ఆవిష్కరించారు.

also read:ఎస్ఈసీ యాప్‌పై లంచ్ మోషన్ పిటిషన్ నిరాకరణ: రేపు విచారిస్తామన్న హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రజలు తమ ఫిర్యాదులను మొబైల్ ఫోన్ ద్వారా కంప్యూటర్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ ను తయారు చేసింది ఎస్ఈసీ.ఈ యాప్ పై వైఎస్ఆర్‌సీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.  ఈ యాప్ ప్రైవేట్ యాప్ అని వైఎస్ఆర్‌సీపీ చెబుతోంది.

ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలకు సంబంధించి నేరుగా ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేసుకొనే వెసులుబాటు ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

ఈ యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది.ఈ పిటిషన్ పై గురువారం నాడు విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.మరో వైపు ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్ సెంటర్ ను కూడ ఏర్పాటు చేసినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 
 

click me!