మదనపల్లి అక్కాచెల్లెళ్ల హత్య: విశాఖ మెంటల్ ఆస్పత్రికి పద్మజ, పురుషోత్తం దంపతులు

By narsimha lodeFirst Published Feb 3, 2021, 10:53 AM IST
Highlights

జిల్లాలోని మదనపల్లిలో జంట హత్యల కేసులో పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులను విశాఖపట్టణం మానసిక చికిత్సాలయానికి తరలించాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.


చిత్తూరు: జిల్లాలోని మదనపల్లిలో జంట హత్యల కేసులో పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులను విశాఖపట్టణం మానసిక చికిత్సాలయానికి తరలించాలని జైలు అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.

మదనపల్లిలో అలేఖ్య, సాయిదివ్వలను తల్లిదండ్రులు హత్య చేశారు.  చనిపోయినవారిద్దరూ బతికి వస్తారని ఈ దంపతులు నమ్మారు. మూఢ భక్తితో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే పద్మజతో పాటు ఆమె భర్త పురుషోత్తంనాయుడుల మానసిక పరిస్థితి సరిగా లేదని వైద్యులు గుర్తించారు. వీరికి చికిత్స అవసరమని భావించారు.

రాత్రిపూట పద్మజ జైల్లో పిచ్చిపిచ్చిగా అరుస్తోన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు న్యాయశాఖ అనుమతి కోరినట్టుగా సమాచారం. న్యాయశాఖ అనుమతి లభించడంతో విశాఖపట్టణంలోని మానసిక చికిత్సాలయానికి పురుషోత్తంనాయుడు, పద్మజలను జైలు అధికారులు విశాఖపట్టణం మెంటల్ ఆసుపత్రికి తరలించనున్నారు.

తానే శివుడినని  పద్మజ జైలు గదిలో పిచ్చి పిచ్చిగా అరుస్తోందని  జైలు అధికారులు గుర్తించారు. జైలుకు వెళ్లే సమయంలో కూడ కరోనా పరీక్షల సమయంలో  కూడ ఆమె తానే శివుడినని  పరీక్షలకు నిరాాకరించారు. 

 

click me!