జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: ఎస్ఈసీ సంచలన ఆదేశాలు

By narsimha lode  |  First Published Feb 18, 2021, 5:18 PM IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ గురువారం నాడు  నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 


అమరావతి: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ గురువారం నాడు  నిమ్మగడ్డ రమేష్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎస్‌ఈసీ మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దగ్గర ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్‌ను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఈ నెల 20లోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్లను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు ఇచ్చే నివేదికల ఆధారంగా న్యాయ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఈసీ తెలిపింది.

Latest Videos

 గతంలో నామినేషన్లు అడ్డుకున్న సమయంలో రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు చేసిన ఫిర్యాదు పేపర్లను కూడా ఇవ్వాలని ఎస్ఈసీ పేర్కొంది. ఫిర్యాదులు లేకపోయినా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల కమిషన్ ఓ ప్రకటనతో తెలిపింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామని నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు.
 

click me!