చంద్రబాబుకు షాక్... మేనిఫెస్టోను ఉపసంహరించుకోడి: టీడీపీకి నిమ్మగడ్డ ఆదేశం

By Siva KodatiFirst Published Feb 4, 2021, 9:12 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షాకిచ్చారు. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని టీడీపీకి నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఎస్ఈసీ వ్యాఖ్యానించారు. 

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షాకిచ్చారు. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని టీడీపీకి నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని ఎస్ఈసీ వ్యాఖ్యానించారు. టీడీపీ మేనిఫెస్టో విడుదలపై ఫిర్యాదును గురువారం నిమ్మగడ్డ పరిశీలించారు.

ఫిర్యాదుతో పాటు టీడీపీ వివరణను పరిశీలించారు. జిల్లాలకు పంపించిన మేనిఫెస్టోను కాపీలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. టీడీపీ మేనిఫెస్టోతో ఎలాంటి ప్రచారం నిర్వహించొద్దని ఎస్ఈసీ స్పష్టం చేశారు. 

Also Read:వైసీపీకి ఊరట, చంద్రబాబుకి షాక్: టీడీపీకి నిమ్మగడ్డ నోటీసులు

కాగా, అంతకుముందు టీడీపీకి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. గ్రామ పంచాయతీ ఎన్నికలకు టిడిపి మేనిఫెస్టో విడుదల చేయడంపై ఎస్ఈసీ కి ఫిర్యాదు చేసింది వైసిపి.

అయితే.. వైసిపి ఫిర్యాదుపై నోటీసులు జారీ చేసారు నిమ్మగడ్డ నిమ్మగడ్డ. ఫిబ్రవరి రెండో తేదీ లోపు వివరణ ఇవ్వాలని కోరారు నిమ్మగడ్డ.

పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని… వైసిపి ఫిర్యాదు చేసిందని నోటీసులో పేర్కొన్నారు నిమ్మగడ్డ. వివరణ ఇవ్వని పక్షంలో తగిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌. 

click me!