ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుఫాన్: నిమ్మగడ్డ రమేష్ కుమార్

By narsimha lodeFirst Published Mar 31, 2021, 10:29 AM IST
Highlights

ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుపానులా సమసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.


అమరావతి: ప్రభుత్వం-ఎస్ఈసీ మధ్య వివాదం టీ కప్పులో తుపానులా సమసిందని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.బుధవారం నాడు విజయవాడలో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 

స్థానిక సంస్థల ఎన్నికలను  విజయవంతంగా నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు. వ్యక్తుల అనాలోచిత చర్యలతో వ్యవస్థకు చేటు అని ఆయన అభిప్రాయపడ్డారు.
సరైన సమయంలో స్పందించకపోతే అగాధాలకు దారి తీస్తోందన్నారు. పదవిలో ఉన్నంత కాలం ఎలాంటి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లలేదన్నారు.

తన హక్కుల సాధనకు తాను వెనుకాడనని ఆయన చెప్పారు.అవసరమైతే తాను హైకోర్టుకు వెళ్లానని ఆయన తెలిపారు. చట్టసభలను, కోర్టులను గౌరవించాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు.ఏపీ ఎస్ఈసీ గా తన తర్వాత నీలం సహానీ బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన స్వాగతించారు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై నీలం సహనీకి తాను లేఖ రాసినట్టుగా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.తాను ఎవరికి ఏమి లేఖలు రాసినా వాటిని బయటకు చెప్పలేనన్నారు.

click me!