ఎన్నికలకు ముందే... గుంటూరు జిల్లాలో తెెలుగుదేశం పార్టీకి షాక్

By Arun Kumar PFirst Published Mar 31, 2021, 10:26 AM IST
Highlights

ఇటీవల సర్పంచ్, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో చవిచూసిన పరాభవం నుండి ఇంకా పార్టీ కోలుకోకముందే ఇలా స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో టిడిపి మరింత బలహీనపడుతోంది. 

మంగళగిరి: అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయితీ, మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో వరుసగా ఘోర పరాభవాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీ ఎంపీటిసి, జడ్పిటిసి ఎన్నికలకు ముందే షాక్ తగిలింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో టిడిపి తరపున ఎంపిటిసి ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు తాజాగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో ఇద్దరు అభ్యర్థులు ఎన్నికలకు ముందే వైసిపిలో చేరి టిడిపికి షాకిచ్చారు. 

దుగ్గిరాల పరిధిలోని ఎంపిటీసి స్థానాలకు టిడిపి తరపున నామినేషన్ దాఖలు చేసిన దరివేముల హనీరాయ్, బాణావత్ ఉమాదేవీలు అధికార పార్టీలో చేరిపోయారు. అలాగే దుగ్గిరాల  సర్పంచ్ బాణావత్ కుశీబాయ్  కూడా టిడిపికి గుడ్ బై చెప్పింది. ఇలా ఇద్దరు ఎంపిటీసి అభ్యర్ధులు, సర్పంచ్ తో పాటు పలువురు స్థానిక నాయకులు కూడా వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. 

ఎన్నికలకు ముందే టిడిపి నాయకులు పార్టీని వీడటంతో గుంటూరు టిడిపిలో ఆందోళన మొదలయ్యింది. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో చవిచూసిన పరాభవం నుండి ఇంకా పార్టీ కోలుకోకముందే ఇలా స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో టిడిపి మరింత బలహీనపడుతోంది. కాబట్టి కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడకుండా చూసుకోవాలని... అయితేనే రానున్న రోజుల్లో వైసిపిని ఎదుర్కోగలమని టిడిపి నాయకులు అదిష్టానికి సూచిస్తున్నారు. 
 

click me!