బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ: ఎస్ఈసీ సంచలన నిర్ణయం

Published : Mar 01, 2021, 07:53 PM IST
బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ: ఎస్ఈసీ సంచలన నిర్ణయం

సారాంశం

 బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసినట్టుగా ఫిర్యాదులు అందిన చోట మళ్లీ నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.


అమరావతి: బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసినట్టుగా ఫిర్యాదులు అందిన చోట మళ్లీ నామినేషన్లు దాఖలు చేసుకొనేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

 మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్ధులను  బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారని టీడీపీ ఆరోపించింది. టీడీపీతో పాటు ఇతర పార్టీలు కూడ అధికార వైసీపీపై ఆరోపణలు చేసింది.

ఈ విషయమై ఎస్ఈసీకి విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకొంది. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేసినట్టుగా ఫిర్యాదులు అందిన చోట్ల మరోసారి నామినేషన్లు మళ్లీ దాఖలు చేసేందుకు ఎస్ఈసీ అవకాశాన్ని కల్పించింది.

తిరుపతి కార్పోరేషన్లలో  ఆరు డివిజన్లు, పుంగనూరులో 3 వార్డులు, రాయచోటిలో 2 వార్డులతో పాటు రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో మళ్లీ నామినేషన్లు వేసుకొనేందుకు అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను వైసీపీ, టీడీపీ, బీజేపీ కూటమి సీరియస్ గా తీసుకొన్నాయి. గ్రామ పంచాయితీ  ఎన్నికల్లో  రాష్ట్రంలో వైసీపీ అత్యధిక స్థానాలను దక్కించుకొంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడ తాము పట్టుసాధిస్తామని విపక్షాలు ధీమాతో ఉన్నాయి.

 


 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్