ఓపెన్ హౌస్: న్యూఇయర్ వేడుకలకు రాజ్‌భవన్ దూరం

By Siva KodatiFirst Published Dec 29, 2020, 7:07 PM IST
Highlights

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గౌరవనీయ గవర్నర్‌ను కలవడం, రాజ్ భవన్‌లో ఆయనతో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకోవటం సంప్రదాయం

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గౌరవనీయ గవర్నర్‌ను కలవడం, రాజ్ భవన్‌లో ఆయనతో ఆహ్లాదకరమైన సమయాన్ని పంచుకోవటం సంప్రదాయం. అయితే  కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా  ఓపెన్ హౌస్ తో సహా నూతన సంవత్సర కార్యక్రమాలు నిర్వహించటం లేదని గవర్నర్  కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు.

సాధారణ ప్రజలు, పౌర సమాజంలోని ప్రముఖులు నూతన సంవత్సరానికి సంబంధించి ఈ మార్పు ను గుర్తించాలన్నారు. ఈ సందర్భంగా గౌరవ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన కరోనా మార్గదర్శకాలను అనుసరించి నూతన సంవత్సరాన్ని సంయమనంతో జరుపుకోవాలని  ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలకు ఏపీ ప్రభుత్వం నో చెప్పింది. విజయవాడలోని హోటల్స్, ఫంక్షన్ హల్లోనూ కొత్త ఏడాది వేడుకలకు కూడ అనుమతి లేదని  విజయవాడ సీపీ  బత్తిన శ్రీనివాసులు తెలిపారు. ఇంట్లోనే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని నగర ప్రజలకు ఆయన సూచించారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా సీపీ చెప్పారు.  బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని సీపీ ప్రకటించారు.

కరోనా స్ట్రెయిన్ కారణంగా ప్రజలు రోడ్ల మీదికి రాకూడదని  సీపీ కోరారు. నగరంలోని బందరు రోడ్డులో ప్రజలు గుమికూడవద్దని రోడ్లపై కేక్ కోయడం వంటివాటిపై నిషేధించినట్టుగా ఆయన చెప్పారు.

ఈ నెల 31వ తేదీ రాత్రి 10 గంటలలోపుగా నగరంలోని వ్యాపార సంస్థలు, దుకాణాలు మూసివేయాలని సీపీ ఆదేశించారు. ఇప్పటికే తెలంగాణలోని హైద్రాబాద్ లో కూడ కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు. 
 

click me!