వైసీపీలో పదవుల రేస్: జగన్ లిస్ట్ లో ఆ నలుగురు

By Nagaraju penumalaFirst Published Dec 14, 2019, 3:45 PM IST
Highlights

నాలుగు స్థానాలకు గానూ ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేయగా నాలుగో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నాలుగో అభ్యర్థి కూడా దాదాపుగా ఖరారైనట్లేనని అయితే సామాజిక వర్గాల విషయం దగ్గరే ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇంతకీ జగన్ మనసులో ఉన్న ఆ నలుగురు ఎవరా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి తెరలేవనుంది. పెద్దల సభలో ఖాళీ కానున్న నాలుగు సీట్లపై అప్పుడే కసరత్తు మెుదలైనట్లు తెలుస్తోంది. 2020లో రాజ్యసభలో ఏపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్న సంగతి తెలిసిందే. 

ఏపీ అసెంబ్లీలో 151 స్థానాలతో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీయే ఆ నాలుగు స్థానాలను దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే ఆ నలుగురు ఎవరా అంటూ ఆసక్తికర చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్ లో మెుదలైంది. 

డిసెంబర్ నెల నడుస్తున్న తరుణంలో కొత్త ఏడాదిలో ఆ ఎంపీ పదవులు ఎవరిని వరించబోతున్నాయా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక మంది రాజ్యసభ సీటుకోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్: అసెంబ్లీలో జగన్ సంచలన వ్యాఖ్యలు...

రాజ్యసభలో బెర్త్ కోసం ఇప్పటికే అధినేత, సీఎం జగన్ మెప్పు పొందేందుకు కొంతమంది నేతలు పడరాని పాట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ విషయం అధిష్టానానికి తెలియడంతో లీకులు ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

నాలుగు స్థానాలకు గానూ ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ ఖరారు చేయగా నాలుగో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. నాలుగో అభ్యర్థి కూడా దాదాపుగా ఖరారైనట్లేనని అయితే సామాజిక వర్గాల విషయం దగ్గరే ఆలోచనలో పడినట్లు సమాచారం. ఇంతకీ జగన్ మనసులో ఉన్న ఆ నలుగురు ఎవరా అంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.  

గత వారం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ప్రకాశం జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. బీద మస్తాన్ రావుకు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అండదండలు ఉన్నట్లు సమాచారం. 

విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావులు క్లాస్ మేట్స్. అంతేకాదు పలు వ్యాపార సంస్థల నిర్వహణలపై తరచూ చర్చించుకుంటూ ఉంటారు. పార్టీలు వేరైనప్పటికీ వారిమధ్య స్నేహం మాత్రం అలానే కొనసాగుతుంది. 

ఇకపోతే పెద్దల సభలో అడుగుపెట్టాలని బీద మస్తాన్ రావు మనసులో ఓ కోరిక మిగిలిపోయిందని ప్రచారం. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం గతంలో రాజ్యసభ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేదు. దాంతో అప్పటి నుంచి ఆయన టీడీపీకి అంటీముట్టనట్లుగా ఉన్నారు. 

అయితే బీద మస్తాన్ రావు కోరికను వైసీపీ నెరవేర్చబోతుందని తెలుస్తోంది. బీద మస్తాన్ రావు మిత్రుడు అయినటువంటి విజయసాయిరెడ్డి ఆయన చిరకాల కోరికను నెరవేర్చబోతున్నారంటూ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. 

ఇకపోతే ఇటీవలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజుకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


పశ్చిమగోదావరి జిల్లాలో రాజకీయంగా పేరొందినటువంటి గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు రాజ్యసభ టికెట్ ఇస్తే పార్టీకి మరింత లాభం చేకూరుతుందంటూ వైసీపీ అధినేత, సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రంగరాజు వైసీపీలో చేరేందుకు జగన్ రాజ్యసభ ఆఫర్ చేసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది.  

ఇకపోతే మూడో అభ్యర్థి రాంకీ గ్రూప్ అధినేత అయోధ్యరామిరెడ్డి అని ప్రచారం జరుగుతుంది. అయోధ్యరామిరెడ్డి ఎన్నాళ్లు నుంచో ఈ పదవికోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. 2014 అయోధ్యరామిరెడ్డి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వయానా ఆయన బావ అయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 

ఇకపోతే అయోధ్యరామిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ ఆపద సమయంలో ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారంటూ టాక్. ఇకపోతే ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

ట్విట్టర్ ఇండియా టాప్ ట్రెండ్స్‌లో #APDishaAct...

ఇదిలా ఉంటే నాలుగో అభ్యర్థి ఎవరా అన్న ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఒంగోలు లోక్ సభ సీటును మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఇచ్చే సమయంలో జగన్ రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. 

దాంతో ఆయన రాజ్యసభ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టేశారు. దాంతో ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందా అన్న సందేహం నెలకొంది. 

మరోవైపు వైవీ సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపని నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపిస్తే పార్టీకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.  

నీకంటూ ఓ గుర్తింపు ఉంది, పరువు తీసుకోకు: పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే...

click me!