గుంటూరు జిల్లా మాచర్లలో టిడిపి నాయకులపై దాడి జరగడంలో పోలీసులు హస్తం వుందని ఆరోపిస్తున్న ఆ పార్టీ నాయకులపై ఏపి పోలీస్ అధికారుల సంఘం తీవ్రస్థాయిలో హెచ్చరించింది.
అమరావతి: టీడీపీ నేతలపై ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాచర్ల ఘటన విషయంలో పోలీసులు, జగన్ సర్కార్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో తాజాగా పోలీసుల సంఘం రియాక్ట్ అయ్యింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.
మాచర్ల ఘటనలో స్థానిక పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చామని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అబద్ధాలు చెబుతున్నారని పోలీసులు సంఘం నాయకులు ఆరోపించారు. దాడి సమాచారం రాగానే వెంటనే డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ నేతలను కాపాడారని అన్నారు. ఇలా ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడారని అన్నారు.
undefined
read more ఆ మహిళ మరణం మెదడువాపుతో కాదు కరోనాతోనే... ప్రభుత్వం దాస్తోంది: నిమ్మల ఆరోపణ
అయితే ప్రాణాలు కాపాడిన పోలీసులనే వారు నిందించడం బాధ కలిగించిందన్నారు. రిపోర్ట్ ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదు అయినా వదిలిపెట్టకుండా సుమోటోగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
పోలీసుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదన్నారు. తమ గురించి శృతిమించి మాట్లాడేవారిపై కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇలా గతకొంత కాలంగా పోలీస్ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో మండిపడింది.