ఒక్క నిర్ణయంతో...హోదాయే కాదు మనసూ గొప్పదేనని చాటిన ఏపి డిజిపి

By Arun Kumar PFirst Published Nov 3, 2020, 2:50 PM IST
Highlights

జులై17వ తేదీన పట్టాభిపురం పోలీసులకు దొరికిన ఏడేళ్ల చిన్నారి హిమబిందుకు నూతన వస్త్రాలు,ఆటబొమ్మలు అందించి గొప్ప మనసును చాటుకున్నారు ఏపి డిజిపి గౌతమ్ సవాంగ్. 

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ గొప్ప మనసును చాటుకున్నాడు.  మంగళవారం గుడ్ షెఫర్డ్ అనే స్వచ్ఛంద సంస్థను సందర్శించిన డీజీపీ అక్కడున్న చిన్నారులను ఆత్మీయంగా పలకరించారు. జులై17వ తేదీన పట్టాభిపురం పోలీసులకు దొరికిన ఏడేళ్ల చిన్నారి హిమబిందుకు నూతన వస్త్రాలు, ఆటబొమ్మలు అందించారు. అలాగే సంస్థలో ఉన్న 22 మంది చిన్నారులకు పుస్తకాలు, చాక్లెట్లు అందచేశారు డీజీపీ. 

ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... ఇకపై కూడా చిన్నారి హిమబిందు సంరక్షణ బాధ్యతలు పోలీస్ శాఖ చూసుకుంటుందని స్ఫష్టం చేశారు. ఆమెకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని పోలీస్ శాఖ తరపున డిజిపి హామీ ఇచ్చారు. 

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఇప్పటి వరకు 13 వేల మంది చిన్నారులకు వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించామన్నా డిజిపి. మహిళలు, యువతులు, చిన్నారులు సురక్షితంగా నివసించే రాష్ట్రంగా ఏపీని తయారుచేస్తామన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్ములన కోసం రేపు(బుధవారం) వెబినార్ నిర్వహిస్తున్నామని... ఇందులో హోంమంత్రి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తో పాటు ఇతర స్వచ్చంద సంస్థలు పాల్గొంటాయని గౌతమ్ సవాంగ్ తెలిపారు. 

click me!