ఇసుక పాలసీ వల్ల చోరీలు.. ప్రజలే నక్సలైట్లపై తిరగబడుతున్నారు: గౌతం సవాంగ్

By Rekulapally Saichand  |  First Published Dec 29, 2019, 2:11 PM IST

ఏపీ పోలీస్ శాఖ   వార్షిక నివేదికను విడుదల చేసింది.    ఏపీ డీజీపీ గౌతం సవంగ్  ఈ నివేదికలో అంశాలను వెల్లడించారు  2018 తో 2019 ను పోల్చితే  కొన్ని కేసులు బాగా పెరిగాయన్నారు.


2019 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ఏపీ పోలీస్ శాఖ విడుదల చేసింది. డీజీపీ గౌతం సవంగ్  ఈ నివేదికలో అంశాలను మీడియాకు వివరిస్తూ. " పోలీస్ శాఖలో మార్పు కు శ్రీకారం చుట్టాం, శాంతి భద్రతాలను కాపాడేలా సమర్ధవంతంగా పోలీస్ శాఖ పనిచేసింది.వృత్తిపరమైన పోటీల్లో  దేశ స్థాయిలో 7 అవార్డులు రాష్ట్రానికి వచ్చాయి. 2018 తో 2019 ను పోల్చితే  కొన్ని కేసులు బాగా పెరిగాయి. అలాగే  కొన్ని నేరాలు తగ్గు ముఖం పట్టాయి..రోడ్డు ప్రమాదాలు దేశ సగటు కంటే రాష్ట్రంలో అధికంగా ఉండటం బాధ కలిగిస్తోంది" అన్నారు.


" పోలీస్ సంక్షేమం లో భాగంగా వీక్లీ ఆఫ్ నిర్ణయం చరిత్రాత్మకం. ఇసుక పాలసీ వలన ఇసుక చోరీ కేసులు 140 శాతం పెరిగాయి.మహిళ భద్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చూట్టాం.   ప్రభుత్వం దిశ మాక్ట్‌ను తీసుకరావడం  అభినందనీయం. మోసాలు, రపేలు, వేధింపులు, పోస్క కేసులు అధికంగా పెరిగాయ"న్నారు

Latest Videos

"వాటితో పాటు సైబర్ నేరాలు కూడా  53 శాతం పెరిగాయి.రాష్ట్రం లో శాంతి భద్రతల ను పెంపొందించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టి 2020 లో నేరాల సంఖ్య తగ్గించి  సేఫ్ రాష్ట్రం గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజల సహకారం తో నక్సలిజం చర్యలు తగ్గుముఖం కు చర్యలు చేపడుతున్నాం...ప్రజలే నక్సలైట్ల పై తిరగబడుతున్నారు.. ప్రజల నక్సలిజాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ"పలు నివేదికలను పలు అంశాలను వెల్లడించారు. 
 

click me!