కౌంటర్: దమ్ముంటే రుజువు చేయండి, రూ.84వేల కోట్లు ఎటు వెళ్ళాయి?

First Published May 31, 2018, 2:00 PM IST
Highlights

బిజెపికి సవాల్ విసిరిన బాబు

అమరావతి: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన
యూసీల గురించి నీతి ఆయోగ్ ఏనాడైనా తప్పు పట్టిందా
అని ఏపీ ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మెన్ కుటుంబరావు  
ప్రశ్నించారు.

 గురువారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో
మాట్లాడారు.బిజెపి అధికార ప్రతినిధి, బిజెపి ఎంపీ జీవీఎల్
నరసింహరావు ఏపీ రాష్ట్రప్రభుత్వంపై బుధవారంనాడు
తీవ్రమైన ఆరోపణలు చేశారు. 

ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి నేతలు, కేంద్ర మంత్రులు  
తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీ
ప్రభుత్వం సమర్పించిన యూసీల గురించి నీతి ఆయోగ్
మాట్లాడకున్నా బిజెపి నేతలు, కేంద్ర మంత్రి జిత్రేంద్రసింగ్
తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

ఏపీ ప్రభుత్వం సమర్పించిన యూసీల్లో తప్పులున్నట్టు
నిరూపించగలరా అని ఆయన సవాల్ విసిరారు. అవగాహన
లేకుండానే మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు.

కృష్ణపట్నం పోర్టుకు నిధులు ఇవ్వకుండానే గొప్పగా
అభివృద్ది చేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. ఏపీకి
ఇప్పటివరకు ఎన్ని కోట్ల నిధులు ఇచ్చారో చెప్పాలని
ఆయన డిమాండ్ చేశారు.


బిజెపి పాలిత రాష్ట్రాలకు కేంద్రం ఎక్కువగా నిధులను
కేటాయిస్తోందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో సర్ధార్
వల్లభాయ్‌పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం ఏక్‌తా ట్రస్టు పెట్టి
విరాళాలు వసూలు చేశారని ఆయన గుర్తు చేశారు.
అంతేకాదు దేశవ్యాప్తంగా సుమారు 5 వేల టన్నుల
ఇనుమును సేకరించి ఆ తర్వాత కిలో రూ.1 విక్రయించారని
ఆయన చెప్పారు.

పటేల్ విగ్రహ ఏర్పాటు కోసం టర్నర్ అనే కంపెనీకి
బాధ్యతలను అప్పగించారని కుటుంబరావు చెప్పారు.పటేల్
విగ్రహం కోసం కేంద్రం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు
చేస్తోందని ఆయన చెప్పారు.


2016-17 లో కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ సెస్ సుమారు 84
వేల కోట్ల నిధులు మళ్ళించారని కాగ్ రిపోర్ట్  నివేదిక
వెల్లడించిన విషయాలను కుటుంబరావు చెప్పారు. సుమారు
19 కేంద్రప్రభుత్వ శాఖలు యూసీలే ఇవ్వలేదని కాగ్
తీవ్రంగా తప్పుబట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.


 

click me!