మావల్లే ఈ పంచాయితీ ఎన్నికలు... ఆ బాధ్యత ఎస్ఈసీదే: ఏపీ పిసిసి చీఫ్ శైలజానాథ్

By Arun Kumar PFirst Published Jan 29, 2021, 3:15 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఉందని ఏపీ పిసిసి చీఫ్ శైలజానాథ్ రెడ్డి పేర్కొన్నారు. 

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఏపి పిసిసి చీఫ్ సాకే శైలజానాథ్ ప్రకటించారు. ఎన్నికలను జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉందన్నారు. మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికను ఏకగ్రీవం చేయాలని చూడటం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలు వల్ల దేశంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని  శైలజానాథ్ పేర్కొన్నారు.

''కేంద్ర ప్రభుత్వం రైతులను సమీదలుగా మార్చింది. గ్రామాల్లో రైతులు రోడ్డున పడే అవకాశం ఉంది. కార్పోరేట్ శక్తులకు ప్రభుత్వ గిడ్డంగులను అప్పగిస్తున్నారు. ఈ విషయం తెలిసినా సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు ఓటు వెయ్యలేదు'' అని శైలజానాథ్ నిలదీశారు. 

read more సీఎం సొంత జిల్లాలో... గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

''వ్యవసాయ మోటర్లకు మీటర్లను పెట్టె నిర్ణయన్నీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తోసుకోవాలి. రాష్ట్రంలో మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చెయ్యాలని చూస్తున్నారు. ఇలా మతతత్వ రాజకీయాలు చేయాలని చూస్తున్న వారిని ప్రజలు గుర్తించాలి. త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో మతతత్వ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడాలి'' అని శైలజానాథ్ సూచించారు.

''పంచాయితీ ఎన్నికల్లో ఫోటీకి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థులు నామినేషన్ ధాఖలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమీషన్ కు సహకరించాలి'' అని శైలజానాథ్ సూచించారు. 

click me!