అక్కడక్కడా ఘర్షణలు, మొత్తం మీద ప్రశాంతమే: ఏపీలో ముగిసిన ‘‘ పరిషత్ ’’ పోలింగ్

By Siva KodatiFirst Published Apr 8, 2021, 5:18 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది. 

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 7,220 ఎంపీటీసీ, 515 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభమైంది.

మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఈసీ తెలిపింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 47.42 శాతం పోలింగ్‌ నమోదైంది.

పరిషత్ ఎన్నికలపై హైకోర్టులో విచారణ నడుస్తుండటంతో.. న్యాయస్థానం ఆదేశాల తర్వాతే కౌంటింగ్ నిర్వహించనున్నారు. మరోవైపు పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చినా.. పలు చోట్ల తెలుగుదేశం అభ్యర్థులు ఎన్నికల పోటీల్లో ఉన్నారు.

అయితే చాలాచోట్ల వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. విజయనగరం జిల్లాలో వైసీపీ, టీడీపీ కార్యకర్థల మధ్య ఘర్షణ నెలకొంది.

ద్వారపూడి పోలింగ్‌ కేంద్రం ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి. ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం.. ఇరువర్గాల మధ్య తోపులాటకు దారి తీసింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు సర్ధి చెప్పేందుకు ప్రయత్నంచారు. 

click me!