విష్ణుమూర్తి వ్యాఖ్యలు: శ్రీవారికి చేసినట్లు.. జగన్‌కూ పూజలు చేస్తారా, పరిపూర్ణానంద విమర్శలు

By Siva KodatiFirst Published Apr 8, 2021, 4:55 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు విష్ణుమూర్తితో పోల్చడంపై కలకలం రేపుతోంది. అయితే  వ్యాఖ్యలను సీఎంతో పాటు వైసీపీ నేతలే ఖండించాలని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టీటీడీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు విష్ణుమూర్తితో పోల్చడంపై కలకలం రేపుతోంది. అయితే  వ్యాఖ్యలను సీఎంతో పాటు వైసీపీ నేతలే ఖండించాలని శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు.

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు ఓటేయాలని ఆయన కోరారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి వస్తున్న సీఎం జగన్‌కు పరిపూర్ణానంద మూడు ప్రశ్నలు సంధించారు.

టీటీడీని సమాచార హక్కు చట్టం పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే రెండేళ్లుగా టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయలేదని.. ఆలయాల కూల్చివేతలపై ఎందుకు స్పందించడం లేదని పరిపూర్ణానంద నిలదీశారు.

Also Read:మనిషిని దేవుడితో పోల్చడం సరైందికాదు: రమణ దీక్షితులు వ్యాఖ్యలకు బాబు కౌంటర్

టీటీడీ బోర్డు రాజకీయాలకు అడ్డాగా మారిందని స్వామిజీ ఆరోపించారు. సీఎంను విష్ణుమూర్తితో పోల్చడం జగన్‌కే ప్రమాదమన్నారు. విష్ణు అనుగ్రహంతో రాజయోగం ఉంటుందని.. రాజునే విష్ణువుగా పోల్చకూడదని తెలిపారు.

వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామికి చేసినట్లు జగన్‌కూ పూజలు చేస్తారా? అని ప్రశ్నించారు. పింక్‌ డైమండ్‌ ఏమైందన్న పరిపూర్ణానంద వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎందుకు దాని ప్రస్తావన తేలవడం లేదని నిలదీశారు.  

click me!