పంచాయితీ ఎన్నికల్లో టిడిపి దూకుడు... పలు కమిటీలు, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

By Arun Kumar PFirst Published Jan 29, 2021, 1:32 PM IST
Highlights

రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతిపక్షతెలుగుదేశం పార్టీ పలు కమిటీలు, కమాండ్ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసింది. 

అమరావతి: రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 15 మంది సభ్యులతో రాష్ట్ర ఎన్నికల కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులకు చోటు కల్పించింది. అలాగే ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీ, ముగ్గురు సభ్యులతో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 25 పార్లమెంట్ నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌ కు ఇద్దరు నాయకులకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలు, మండల స్థాయి నేతలతో సమన్వయ బాధ్యతలు అందించింది. టీడీపీ శ్రేణులకు, ప్రజలకు స్థానికి ఎన్నికలకు సంబంధించి న్యాయ సలహాలు, సహకారం అందించేందుకు పది మంది సభ్యులతో లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేసినట్లు...  24 గంటలూ వారు అందుబాటుల ఉంటారని టిడిపి ప్రకటించింది.

రాష్ట్ర ఎన్నికల కమిటీ :

1.    కింజరాపు అచ్చెన్నాయుడు    
2.    యనమల రామకష్ణుడు
3.    నారా లోకేష్‌    
4.    వర్ల రామయ్య
5.    కళా వెంకట్రావు    
6.    సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి
7.    కాల్వ శ్రీనివాసులు    
8.    ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌
9.    డోలా బాల వీరాంజనేయస్వామి    
10.    బీదా రవిచంద్ర
11.    బోండా ఉమామహేశ్వరరావు    

ఎక్స్‌ అఫిషియో సభ్యులు :

1.    టి.డి.జనార్థన్‌    
2.    పి.అశోక్‌ బాబు
3.    గురజాల మాల్యాద్రి    
4.    మద్దిపాటి వెంకటరాజు

ఎన్నికల సమన్వయ కమిటీ :
    
1.    కింజరాపు అచ్చెన్నాయుడు    
2.    నారా లోకేష్‌
3.    టి.డి జనార్థన్‌     
4.    ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌
5.    గన్ని కష్ణ    
6.    మద్ది పాటి వెంకటరాజు
7.    చింతకాయల విజయ్‌

కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ( న్యాయ సలహాలు, సూచనల కొరకు)
1.    వర్ల రామయ్య      
2.  గన్ని కష్ణా     
3.    ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌

జోన్‌ -1 
1.    శ్రీకాకుళం
2.    విజయనగరం    
3.    విశాఖపట్నం
4.    అరకు    
5.    అనకాపల్లి
సమన్వయ కర్తలు : బుద్ధా వెంకన్న, దువ్వారపు రామారావు

జోన్‌ -2 
    
1.    కాకినాడ    
2.    అమలాపురం    
3.    రాజమండ్రి
4.    నర్సాపురం    
5.    ఏలూరు
సమన్వయ కర్తలు : మంతెన సత్యనారాయణ రాజు, పంచుమర్తి అనురాధ

జోన్‌ - 3 

1.    మచిలీపట్నం    
2.    విజయవాడ    
3.    గుంటూరు
4.    నర్సరావుపేట    
5.    బాపట్ల
సమన్వయ కర్తలు : బత్యాల చెంగల్రాయుడు, పర్చూరు అశోక్‌ బాబు


జోన్‌ - 4

1.   ఒంగోలు            
2.    నెల్లూరు         
3.    తిరుపతి     
4.    చిత్తూరు    
5.    రాజంపేట
సమన్వయకర్తలు : అనగాని సత్యప్రసాద్‌, గునుపాటి దీపక్‌ రెడ్డి

జోన్‌- 5 

1.    కడప    
2.    కర్నూలు    
3.    నంద్యాల
4.    అనంతపురం    
5.    హిందూపురం
సమన్వయకర్తలు : ఎన్‌.అమర్నాథ్‌ రెడ్డి, ద్వారపురెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి
    
ఇదే విధంగా పార్లమెంటు నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమన్వయకర్తలు, న్యాయ సలహాదారులు ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కార్యక్రమాల కమిటీ ఇన్‌ఛార్జ్‌ మద్దిపాటి వెంకటరాజు ఓ ప్రకటన విడుదల చేశారు. 
 

click me!