ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి... చాక్లెట్ ఆశచూపి, పక్కకు తీసుకెళ్లి దారుణం..

Published : Aug 24, 2021, 09:05 AM ISTUpdated : Aug 24, 2021, 09:41 AM IST
ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి... చాక్లెట్ ఆశచూపి, పక్కకు తీసుకెళ్లి దారుణం..

సారాంశం

కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు.ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తానని ఆశచూపి పక్కనే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. 

విజయవాడ : క్రిష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొండపల్లిలోని శాంతి నగర్ లో ఆరేళ్ల బాలుడి మీద ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మీద పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపల్లిలోని శాంతినగర్ ఇందిరమ్మ కాలనీలో ఆరేళ్ల బాలుడు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి పరిసరాల్లో ఆడుకుంటున్నాడు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి చాక్లెట్ కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తానని ఆశచూపి పక్కనే ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. దీంతో అస్వస్థతకు గురైన బాలుడు.. కొంత సేపటికి తేరుకుని ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. 

దీంతో వారు ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. బాలుడిని చికిత్స నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. 

అఘాయిత్యానికి గురై ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాలుడిని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరామర్శించారు. వైద్యులు, బాధఇత బాలుడి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వైసీపీ పాలనతో అరాచకశక్తులు పెచ్చుమీరిపోతున్నాయని విమర్శించారు. 

ఈ ఘటన జరిగిన 24 గంటల తర్వాత కూడా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు.  ఈ ఘటనను ఎందుకు దాచిపెట్టాలని చూస్తున్నారో చెప్పాలన్నారు. బాలుడి మీద లైంగిక దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!