దొంగ ఓట్ల కల్చర్‌ టీడీపీదే... ఆధారాలివే..: ఎస్ఈసికి వైసిపి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Nov 15, 2021, 5:30 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందంటూ అధికార వైసిపి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది, 

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని పలుచోట్లు ఇవాళ(సోమవారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఎన్నిక జరిగింది. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకుని టిడిపి కోలుకోలేని దెబ్బతీయాలని అధికార వైసిపి... తమ కంచుకోటను కాపాడుకోవాలని టిడిపి ప్రయత్నించాయి. ఇరు పార్టీలు కుప్పం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 

ఇవాళ kuppam municipality పరిధిలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మీరంటే మీరు దొంగఓట్లు వేస్తున్నారంటూ ap state election commission అటు టిడిపి, ఇటు వైసిపి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. కుప్పంలో టిడిపీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఈసీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నారాయణమూర్తి ఫిర్యాదు చేసారు.

ఎన్నికల సంఘం  కార్యాలయానికి వెళ్లి ఎస్ఈసి నీలం సాహ్నికి YSRCP తరపున ఫిర్యాదు లేఖను అందజేసారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కుట్రలకు తెరలేపిందని... అక్రమ మార్గంలో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. టిడిపి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను కూడా ఈసీకి అందించినట్లు అప్పిరెడ్డి తెలిపారు.

టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలను దిగజార్చేలా వ్యవహరించాడని అప్పిరెడ్డి మండిపడ్డారు. కుప్ప మున్సిపల్ ఎన్నికల్లో వైసిపి నేతలు, కార్యకర్తలపై మాజీ మంత్రి అమర్నాథ్‌ రెడ్డి, పులివర్తి నాని దౌర్జనానికి దిగారని ఆరోపించారు. 

READ MORE  చంద్రబాబు కుప్పం కోట బద్దలైంది: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల

ఇక ఇటీవల కుప్పం పర్యటనలో టిడిపి నాయకుడు నారా లోకేష్‌ న్యాయస్థానాల విలువలను దిగజార్చేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఓటర్లను భయపెడుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఇదిలావుంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసిపి అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి టిడిపి కూడా ఇప్పటికే  ఫిర్యాదు చేసింది. కుప్పంతో సహా మిగతాచోట్ల జరుగుతున్న పోలింగ్ లో వైసిపి నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని... దీన్ని అడ్డుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్నీకి ఫిర్యాదు చేసారు. టిడిపి నాయకులు అశోక్‌బాబు, బొండా ఉమ, బోడె ప్రసాద్ ఎస్ఈసిని కలిసి వైసిపి అక్రమాలపై ఫిర్యాదు చేసారు. 

READ MORE  Chandrababu Naidu: పోలీసుల పని ప్రజలు చేయాలా?.. చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు.. చంద్రబాబు నాయుడు ఫైర్

ఇక కుప్పం మున్సిపల్ ఎన్నిక పోలింగ్ లో అధికార  వైసిపి అక్రమాలకు పాల్పడుతుందని... వాటిని అడ్డుకోడానికి సిద్దంగా వుండాలని టిడిపి శ్రేణులకు టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచించారు. దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలకు సంబంధించిన ఆధారాలను సేకరించాలని... వీడియోలు తీసి బయటపెట్టాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కుప్పంలో పోలింగ్ సందర్భంగా అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసారు. బాబాయ్‌ని గొడ్డ‌లి పోటుతో బ‌లిచేసిన‌ట్టే... ప్ర‌జాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో ఖూనీ చేస్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డ‌బ్బుతో అత్యంత ప‌విత్ర‌మైన ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌ని జ‌గ‌న్‌రెడ్డి న‌డిబ‌జారులో అంగ‌డి స‌రుకు చేశారని మండిపడ్డారు. టిడిపి నేత‌ల్ని నిర్బంధించి, ఏజెంట్ల‌ని అరెస్టుచేసిన పోలీసులు...ఇత‌ర‌ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని మాత్రం కుప్పంలోకి ఎలా రానిచ్చారు? అని లోకేష్ ప్రశ్నించారు.


 

click me!