చంద్రబాబు పాత అబద్దాలకు కొన్ని కొత్తవి జోడించాడు.. టీడీపీ మేనిఫెస్టో‌పై ఏపీ మంత్రులు ఫైర్..

By Sumanth KanukulaFirst Published May 29, 2023, 2:52 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ  మంత్రులు, వైసీపీ నేతలు  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీ మహానాడు వేదికగా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫేజ్ 1 మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మేనిఫెస్టోపై ఏపీ  మంత్రులు, వైసీపీ నేతలు  తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మరోసారి చంద్రబాబు అబద్దాలతో ముందుకు వెళ్లే ప్రయత్నం  చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాత అబద్దాలకు మరికొన్ని కొత్తవి జోడించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికల్లే గెలిచిందుకే మేనిఫెస్టో పేరుతో ప్రజలను మోసం చేయాలని  చూస్తున్నారని విమర్శించారు. అబద్దపు హామీలో 2014 మాదిరి.. 2024లో కూడా గెలవాలని  చంద్రబాబు  చూస్తున్నారని.. ప్రజలు ఆలోచన చేయాలని  కోరారు. 

డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందిస్తూ.. చంద్రబాబు పాత మేనిఫెస్టోను శ్మశానంలో తగలపెట్టారని విమర్శించారు. చంద్రబాబుది వెన్నుపోటు, అబద్దాలు మేనిఫెస్టో అని విమర్శలు గుప్పించారు. టీడీపీ నిర్వహించింది మహానాడు కాదని.. వెన్నుపోటు దారులు నాడు అని విమర్శించారు. ఇక, వైసీపీ పథకాలనే టీడీపీ కాపీ కొట్టిందని హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. 

మంత్రి  జోగి రమేష్ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతేనని విమర్శించారు. 14 ఏళ్లు చంద్రబాబు  అధికారంలో ఉండి చేయలేని అభివృద్దిని.. సీఎం జగన్ నాలుగేళ్లలో చేసి చూపించారని అన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన 650 వాగ్దానాలలో 10 కూడా నెరవేర్చలేదని విమర్శించారు. మేనిఫెస్టోను  మాయం చేసిన ఘనుడు  చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబుది నకిలీ  చరిత్ర అని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పొత్తులు లేకుండా  ఎన్నికలకు వెళ్లలేని  స్థితిలో ఉన్నాడని విమర్శలు గుప్పించారు. 

click me!