అవి రహస్యంగా ఉంచాలి.. యనమల

First Published Jun 15, 2018, 2:03 PM IST
Highlights

వైసీపీ, బీజేపీ నేతలు కుమ్మక్కయ్యారు

శాసనసభ కమిటీలన్నీ రాజ్యాంగబద్ధమని, శాసనసభ కమిటీల రిపోర్టులను రహస్యంగా ఉంచాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. వైసీపీ నేత, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిసి.. పేపర్లను అందించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

దీనిపై స్పందించిన మంత్రి యనమల మీడియాతో మాట్లాడుతూ శాసనసభ ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధం కాదా..? ప్రశ్నించారు. ఇదే నిజమైతే బుగ్గనపై ప్రివిలేజ్ మోషన్ ఎందుకు పెట్టకూడదని మంత్రి ప్రశ్నించారు.  ఈ వ్యవహారంలో నిజానిజాలు నిర్ధారించాల్సి ఉందని మంత్రి యనమల అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
‘‘దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వైసీపీ, బీజేపీ నేతలు ఒక్కటయ్యారు.  ఏపీ ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌, వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో భేటీ అయినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.’’ అని ఆయన అన్నారు. 

click me!