సీఎస్ పై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి యనమల

By Nagaraju penumalaFirst Published Apr 24, 2019, 12:24 PM IST
Highlights

చంద్రబాబు నాయుడు బాటనే అనుసరిస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇప్పటికే పలుమార్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చిర్రుబుర్రులాడిన యనమల తాజాగా మారోసారి రెచ్చిపోయారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సీఎస్ కు సంబంధం ఏంటని నిలదీశారు. 
 
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న విబేధాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

చంద్రబాబు నాయుడు బాటనే అనుసరిస్తున్నారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇప్పటికే పలుమార్లు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై చిర్రుబుర్రులాడిన యనమల తాజాగా మారోసారి రెచ్చిపోయారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు సీఎస్ కు సంబంధం ఏంటని నిలదీశారు. 

సీఎస్ సమీక్షకు హాజరుకావాలని సిఈవో గోపాలకృష్ణ ద్వివేది కలెక్టర్లు, ఎస్పీలకు సూచించడం ఏంటని ప్రశ్నించారు. కౌంటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లకు సంబంధించిన వ్యవహారాలు, పర్యవేక్షణ అంతా సిఈవో పరిధిలో ఉంటుందని సీఎస్ కు ఏమాత్రం సంబంధం ఉండదన్నారు. 

అలాంటిది సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ లు, సమీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు, ఎస్పీలు రిటర్నింగ్ అధికారులుగా పరిగణింపబడతారని వారు సీఈవో పరిధిలోకే వస్తారని మంత్రి యనమల స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై సీఎస్ సమీక్ష నిర్వహిస్తే పర్లేదు కానీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రివ్యూలు నిర్వహించడమేంటని యనమల ప్రశ్నించారు. 
    
click me!