అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు : చంద్రబాబుపై మంత్రి రజనిఫైర్

By narsimha lode  |  First Published Sep 21, 2022, 12:31 PM IST

ఎన్టీఆర్ పై చంద్రబాబు గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని  ఏపీ మంత్రి  విడుదల రజని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పై ఎవరికి ఎంత ప్రేమ ఉందో ప్రజలకు తెలుసునని ఏపీ మంత్రి రజని చెప్పారు. 
 


అమరావతి: ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యమని  గతంలో చంద్రబాబు అన్నారని ఏపీ  మంత్రి రజని చెప్పారు. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబుకు గౌరవం లేదని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలే రుజువు చేశాయన్నారు. 

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు స్థానంలో వైఎస్ఆర్ పేరును మారుస్తూ  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని బుధవారం నాడు అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎన్టీఆర్ అవసరం మాకు లేదని చంద్రబాబు మాట్లాడిన మాటలను ఆమె గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు మార్చేస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. 

Latest Videos

undefined

 ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటులో వైఎస్ఆర్ కృషిని మర్చిపోలేమన్నారు. వైద్య రంగంలో వైఎస్ఆర్ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఆమె గుర్తు చేశారు. డాక్టర్ గా ఉంటూ పేదలకు రూపాయికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి  సేవలు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.  వైఎస్ఆర్  గొప్ప మానవతావాది అని మంత్రి చెప్పారు. కేంద్రంతో  పొత్తు ఉన్నప్పుడు ఏపీకి ఏం చేశారని మంత్రి టీడీపీని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు బాగుపడడం టీడీపీకి ఇష్టం లేదన్నారు. 

also read:ఎన్టీఆర్ ను అవమానించాలనే ఉద్దేశ్యం లేదు: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

గతంలో చంద్రబాబునాయుడికి , ఓ పత్రికాధిపతికి మధ్య జరిగిన సంభాషణ విషయాన్ని మంత్రి రజని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతంలో చంద్రబాబునాుయుడు ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్ లను సభలో మంత్రి చూపించారు. 

అధికారంలో ఉన్నప్పుడు  ఎన్టీఆర్ గుర్తుకు రారు:చంద్రబాబుపై రోజా ఫైర్

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్టుగా ఏపీ మంత్రి రోజా చెప్పారు. ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే చంద్రబాబునాయుడు ఎందుకు ఆయనకు వెన్నుపోటు పొడిచారో చెప్పాలన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ లను పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చిన చరిత్ర వైఎస్ఆర్ దేనని ఆమె గుర్తు చేశారు. అలాంటి వైఎస్ఆర్ పేరును హెల్త్ యూనివర్శిటీకి పెట్టడం సముచితంగా ఉంటుందని  మంత్రి రోజా చెప్పారు. హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడం ఎన్టీఆర్ ను అవమానించడం కాదన్నారు. వైఎస్ఆర్ ను గౌరవించుకోవడమేనని మంత్రి రోజా చెప్పారు. రూపాయికే వైద్యం చేసిన అనేక మందికి వైద్య సేవలు చేసిన చరిత్ర వైఎస్ఆర్ దేనని ఆమె గుర్తు చేశారు.అధికారంలో లేనప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబం గుర్తుకు వస్తుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎన్టీఆర్ కు గుర్తుకు ఉండరని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అసెంబ్లీ నుండి వైఎస్ఆర్ ఫోటోను తొలటించారన్నారు. పది మందికి సహయం చేసిన చరిత్ర వైఎస్ఆర్ దనిఆమె గుర్తు చేశారు. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్  ఈ విషయ,మై ప్రసంగించారు. సీఎంజగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. 

 
 

click me!