ఎన్టీఆర్ ను అవమానించాలనే ఉద్దేశ్యం లేదు: ఏపీ మంత్రి అంబటి రాంబాబు

By narsimha lodeFirst Published Sep 21, 2022, 12:06 PM IST
Highlights

ఎన్టీఆర్ ను అవమానించాలనే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.  వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చినందుకే  హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 

అమరావతి: ఎన్టీఆర్ ను అవమానించాలనే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.ఎన్టీఆర్ ను టీడీపీ కంటే తమ పార్టీయే ఆయనను గౌరవించిందన్నారు. 

అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురైన తర్వాత ఏపీ మంత్రి అంబటి రాంబాబు  మాట్లాడారు. టీడీపీ పక్ష నేత చంద్రబాబునాయుడు అసెంబ్లీని బహిష్కరించాడన్నారు. కానీ చంద్రబాబు శిష్యులు మాత్రం అసెంబ్లీకి వచ్చి సస్పెన్షన్ కు గురయ్యేవారు ఆందోళన చేస్తున్నారన్నారు. ఐదు రోజులుగా ఇదే తంతు సాగుతుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు. 

అసెంబ్లీలో ఆందోళన  చేసిన టీడీపీ ఎమ్మెల్యేలకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎన్టీఆర్ మాకు రాజకీయ ప్రత్యర్ధి అని చెప్పారు.  ఎన్టీఆర్ ను అన్ని విధాలా గౌరవించిన ప్రభుత్వం తమదన్నారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టినట్టుగా చెప్పారు. వైద్య రంగంలో వైఎస్ఆర్ సంస్కరణలు తెచ్చినందుకే హెల్త్ యూనివర్శిటీ వైఎస్ఆర్ పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఏ మేరకు వైఎస్ఆర్ ను స్మరించుకొన్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ ను అవమానించాలనే ఉద్దేశ్యం తమ ప్రభుత్వానికి లేనే లేదని అంబటి రాంబాబు చెప్పారు. 

also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల ఆందోళన: వరుసగా ఐదో రోజూ టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఆ తర్వాత ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ప్రసంగించారు. టీడీపీ సభ్యులు ఇవాళ సభలో వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్ పై దాడికి దిగారన్నారు. ఈ విషయమై సీసీటీవీ పుటేజీని పరిశీలించి టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఎన్టీఆర్ ను అవమానించడమంటే జాతిని అవమానించడమేనని టీడీపీ సభ్యులు చేసిన నినాదాలను మంత్రి అంబటి రాంబాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ ను చంద్రబాబునాయుడు అవమానించారని మంత్రి అంబటి రాంబాబు  చెప్పారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నారని చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని  చంద్రబాబు చిందరవందర చేశారన్నారు. వైస్రాయి హోటల్ వద్ద ఎన్టీఆర్ పై చెప్పులు వేశారన్నారు. ఎన్టీఆర్ నుండి  అధికారాన్ని కైవసం చేసుకొనే సమయంలో హరికృష్ణను దగ్గరకు లాక్కొని ఆ తర్వాత  వదిలేసిన చరిత్ర చంద్రబాబుదని అంబటి రాంబాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు నమ్మక ద్రోహం చేసింది  చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీదన్నారు చంద్రబాబుతో పాటు అసెంబ్లీకి రావాలని ఆయన టీడీపీ సభ్యులకు సూచించారు. స్పీకర్ కుర్చి వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు ఆందోళన చేసిన తీరును ఆయన తప్పు బట్టారు

click me!