పోతేపోయాడు, పార్టీకొచ్చిన నష్టం ఏమీ లేదు: ఆమంచిపై మంత్రి శిద్ధా రాఘవరావు

By Nagaraju penumalaFirst Published Feb 13, 2019, 7:51 PM IST
Highlights

తనకు ఇష్టం లేనప్పుడు పార్టీ వీడటం కరెక్టే కానీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని తెలిసి కూడా బాధ్యతారహితంగా మాట్లాడారని ఆరోపించారు. చివరికి ఆడపడుచులకు ఇచ్చే పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. 

అమరావతి: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ వీడటంపై మంత్రి శిద్ధా రాఘవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమంచి పార్టీని వీడటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. 

తనకు ఇష్టం లేనప్పుడు పార్టీ వీడటం కరెక్టే కానీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చెయ్యడం సరికాదన్నారు. సీనియర్ ఎమ్మెల్యేగా అన్ని తెలిసి కూడా బాధ్యతారహితంగా మాట్లాడారని ఆరోపించారు. చివరికి ఆడపడుచులకు ఇచ్చే పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదన్నారు. 

రాష్ట్రం అప్పుల్లో ఉన్నా అన్ని రాష్ట్రాల కంటే ధీటుగా సంక్షేమ పథకాలు అందిస్తుంటే అభినందించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ నిలదీశారు. ఇటీవల చంద్రబాబును కలిసినప్పుడు తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆమంచి చెప్పారని అయితే ఇంతలోనే పార్టీ మారతారని ఊహించలేదన్నారు. ఆమంచి వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని టీడీపీ చీరాలలో విజయం సాధించడం ఖాయమన్నారు మంత్రి శిద్ధా రాఘవరావు.  
 
click me!