మళ్లీ ఆంధ్రాలో అడుగుపెట్టిన తలసాని (వీడియో)

Published : Feb 13, 2019, 07:42 PM IST
మళ్లీ ఆంధ్రాలో అడుగుపెట్టిన తలసాని (వీడియో)

సారాంశం

తెలంగాణ మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. గతంలో మాదిరిగానే తలసాని వ్యక్తిగత పనులపై రాజమండ్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమంలో హాజరయ్యేందుకే తలసాని మరోసారి ఆంధ్ర ప్రదేశ్ కు వెళ్ళినట్లు సన్నిహితులు తెలిపారు.  

తలసాని శ్రీనివాస్ యాదవ్  రాక సందర్భంగా రాజమండ్రిలోని యాదవ సంఘాల ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇలా ర్యాలీగా విమానాశ్రయానికి వెళ్లి తలసానికి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి ఆయన నేరుగా వివాహానికి హాజరయ్యారు. 

కొద్దిరోజుల క్రితమే తలసాని ఏపిలో పర్యటించి అధికార టిడిపిపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వం యాదవులకు రాజకీయంగా, సామాజికంగా మంచి అవకాశాలు కల్పిస్తోందని...కానీ ఏపిలో అధికార టిడిపి పార్టీ వారిని విస్మరిస్తోందని ఆరోపించారు. అలాగే  తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసినందుకు ఏపి సీఎం చంద్రబాబు రిటర్న్ గిప్ట్ ఇవ్వడానికి తమ సీఎం కేసీఆర్ సిద్దంగా వున్నారని...ఏపి రాజకీయాల్లో తాము కలుగజేసుకోవడం ఖాయమని తలసాని ప్రకటించారు. 

అయితే అప్పుడు కూడా తలసాని వ్యక్తిగత పనులపైనే ఏపిలో పర్యటించినా రాజకీయ విమర్శలు చేసి కలకలం సృష్టించారు. తాజాగా మరోసారి ఆయన రాజమండ్రి పర్యటనకు రావడంతో ఏపి రాజకీయాలు వేడెక్కాయి.  

వీడియోలు

"

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu