మరో నాలుగైదు నెలల పాటు మీడియాలో కవరేజీ కోసం పవన్ కళ్యాణ్ ఇవాళ తమపై ఘాుటు విమర్శలు చేశారని ఏపీ మంత్రి అప్పలరాజు చెప్పారు.
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ యుద్ధం చేయలేడని ఏపీ మంత్రి అప్పలరాజు చెప్పారు. యుద్ధానికి ఆయన పనికి రాడన్నారు.ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు మంగళవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించారు. తనపై వైసీపీ చేస్తున్న విమర్శలపై పనన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు.మంత్రులు,వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.తనను ప్యాకేజీ స్టార్ అని వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
ప్రజారాజ్యం పార్టీలో ఉన్న సమయంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలను మంత్రి అప్పలరాజు గుర్తు చేశారు.తాము బస్సు యాత్ర చేస్తున్న సమయంలో కూడా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారు. నియంత్రణలేని మాటలుమాట్లాడడం పవన్ కళ్యాణ్ కే సాధ్యమౌతుందన్నారు.
undefined
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూస్తే తీవ్ర నిరాశ, నిస్పృహలు కన్పిస్తున్నాయన్నారు. రాజకీయాల్లో ఉన్న విలువలను పూర్తిగా పాతరేసేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మరో మూడు నాలుగైదు మాసాలు మీడియాలో చర్చ కోసం పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఉందని మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు.
చంద్రబాబును సీఎంను చేయడం కోసం పవన్ కళ్యాణ్ పార్టీని పెట్టారని చెప్పారు.2014 తర్వాత బీజేపీని, టీడీపీని పవన్ కళ్యాణ్ తిట్టారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారన్నారు.
also read:ఉన్మాద ప్రసంగం: పవన్ కళ్యాణ్ పై ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్
పవన్ కచ్చితంగా ప్యాకేజీ తీసుకున్నాడని ఆయన ఆరోపించారు.మొదటి అమ్మాయికి విడాకులివ్వకుండానే రెండో అమ్మాయితో పవన్ కళ్యాణ్ సహ జీవనం చేశాడన్నారు.పవన్ కళ్యాణ్ ది చంచల మనస్తత్వంగా ఆయన పేర్కొన్నారు.మూడు రోజుల క్రితం విశాఖపట్టణంలో విశాఖ గర్జనను జేఏసీ నిర్వహించింది. అదే రోజున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్లారు .విశాఖ గర్జనకు వస్తున్న మంత్రుల కార్లపై జనసేన దాడికి దిగిందని వైసీపీ ఆరోపించింది.అయితే జనసేన మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది.. వైసీపీ మాత్రమే దాడులు చేయించుకొని తమపై నిందలు వేస్తుందన్నారు.