పట్టుచీర కావాలో పసుపు చీర కావాలో తేల్చుకోవాలి: చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

Published : Apr 27, 2022, 10:49 AM IST
పట్టుచీర కావాలో పసుపు చీర కావాలో తేల్చుకోవాలి: చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

పట్టు చీర కావాలో పసుపు చీర కావాలో తేల్చుకోవాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడిపై  ఏపీ మంత్రి ఆర్ కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


హైదరాబాద్:  కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించలేని Chandrababu Naidu చీర కట్టుకోవాలని ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి RK Roja  తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బుధవారం నాడు ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె. రోజా Amaravathi లో మీడియాతో మాట్లాడారు.ఎమ్మెల్యేగా గెలవలేని Nara Lokesh  కూడా చీర కట్టుకోవాలన్నారు. Saree  కావాలో చుడీదార్ కావాలో TDP  నేతలే తేల్చుకోవాలని మంత్రి రోజా ప్రశ్నించారు. దమ్మున్న సీఎం జగన్  గురించి టీడీపీకి చెందిన మహిళా నాయకురాలితో అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆమె మండిపడ్డారు. సీఎం సతీమణి పై కూడా నీచంగా టీడీపీ నేతలు మాట్లాడడడాన్ని తప్పు బట్టారు. 

టీడీపీలో ఉన్నంత మంది ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరన్నారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని రోజా విమర్శించారు. అందరి కంటే పెద్ద ఉన్మాది చంద్రబాబు అని ఆమె విమర్శించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని మంత్రి రోజా మండిపడ్డారు.చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం జగన్ ఇమేజ్ ను దిగజార్చేందుకు టీడీపీ కంకణం కట్టుకుందన్నారు.  సీఎం జగన్ దమ్మున్న నాయకుడన్నారు.  మహిళా సాధికారిత దిశగా సీఎం YS Jagan కృషి చేస్తున్నారన్నారు.స్వంతంగా ఎన్నికల్లో విజయం సాధించలేని చంద్రబాబు నాయుడు చీర కావాలో, చుడీదార్ ను కావాలో తేల్చుకోవాలన్నారు.చంంద్రబాబు, లోకేష్ లు ఇద్దరూ చీరలు కట్టుకోవాలన్నారు.  పట్టు చీరలు కావాలో పసుపు చీరలు కావాలో తేల్చుకోవాలని మంత్రి రోజా  కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాల్లో 75 శాతం మహిళలకే అందిస్తున్నామన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu