స్నేహితురాలికి బంగారు గొలుసు కానుక.. దాన్ని తిరిగి తీసుకోవడానికి దోపిడీ నాటకం.. ఆ తరువాతే...

Published : Apr 27, 2022, 10:04 AM IST
స్నేహితురాలికి బంగారు గొలుసు కానుక.. దాన్ని తిరిగి తీసుకోవడానికి దోపిడీ నాటకం.. ఆ తరువాతే...

సారాంశం

స్నేహితురాలికి ఇచ్చిన బంగారు గొలుసు తిరిగి తీసుకోవాలని ఓ వ్యక్తి దారుణానికి తెగబడ్డాడు. చెయిన్ స్నాచింగ్ చేయించాడు. దీంతో అతడు, అతనికి సహకరించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కృష్ణాజిల్లా : స్నేహితురాలికి కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తిరిగి రాబట్టుకునేందుకు దోపిడీ నాటకమాడిన స్నేహితుడు, అతనికి సహకరించిన ముగ్గురు మిత్రులు పోలీసులకు దొరికిపోయిన ఘటన పెనుగంచిప్రోలులో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. నిందితులను రెండు రోజుల్లో పట్టుకున్నారు. మంగళవారం నందిగామ ఏసీపీ నాగేశ్వర రెడ్డి కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు చెందిన పుచ్చకాయల గోపికృష్ణ, కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన వివాహిత స్నేహితులు.

ఆ పరిచయంతో కొంతకాలం కిందట గోపీకృష్ణ 30గ్రాముల బంగారు గొలుసును ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. దానిని ఆమె నుంచి తిరిగి తీసుకునేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదీన పెనుగంచిప్రోలులో జరిగిన ఓ వేడుకకు ఆమె వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అతను పెనుగంచిప్రోలు వచ్చాడు. నందిగామలో ఆమెను తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. ముండ్లపాడు సమీపంలోని Nsp కాల్వకట్ట వద్దకు వెళ్లేసరికి వెనకనుంచి వచ్చిన ముగ్గురు యువకులు వారిని అటకాయించి, మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు.

అయితే, ఇంత జరిగినా పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని అతను ఆమెను వారించాడు. అయినా ఆమె వినకుండా 112కు  ఫోన్ చేసింది.  వెంటనే స్పందించిన పోలీసులు రంగంలోకి దిగారు. వారికి గోపికృష్ణ వ్యవహారశైలిపై అనుమానంతో విచారణ ప్రారంభించారు. గొలుసు లాక్కెళ్లిన ముగ్గురు నిందితులు మధిరకు చెందిన ఎం. నాగరాజు, జి. అక్షయ్ కుమార్, ఎ. వెంకటేశ్వరరావులుగా  గుర్తించారు.  మంగళవారం వారిని అరెస్టు చేసి గొలుసు స్వాధీనం చేసుకున్నారు. గోపి కృష్ణ పథకం మేరకే తాము గొలుసు లాక్కెల్లినట్లు ముగ్గురు పోలీసులకు తెలిపారు. గోపికృష్ణతో పాటు ముగ్గురిని అరెస్టు చేసి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారని నెపంతో ఒక వ్యక్తిని police చితకబాదిన సంఘటన కలకలం రేపింది. Prakasam District సంతనూతలపాడు మండలం గంగవరంలో మంగళవారం ఇది చోటు చేసుకుంది. బొడ్డువారిపాలెం గ్రామంలో వాలంటీర్ల సన్మాన కార్యక్రమానికి శాసనసభ్యులు టీజెఆర్ సుధాకర్ బాబు వెళ్తున్నారు. మార్గమధ్యంలో గంగవరం వద్ద రోడ్లు,  కాలువల సమస్యలను చెప్పేందుకు ఏం రాఘవయ్య అనే వ్యక్తి ప్రయత్నించాడు. ఆయన ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపై అడ్డంగా పెట్టడంతో మండలపార్టీ అధ్యక్షుడు డీ. చెంచిరెడ్డి  ఆగ్రహించి వాగ్వాదానికి దిగారు.

ఆయన అనుచరులు దుర్భాషలాడుతూ ద్విచక్ర వాహనాన్ని పక్కకు నెట్టేశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఆ తర్వాత  సంతనూతలపాడు ఎస్ఐ  బి. శ్రీకాంత్, సిబ్బంది గ్రామానికి వచ్చి…  ‘ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డగిస్తావా?’ అంటూ స్టేషన్కు తీసుకువెళ్లి కొట్టడంతో తన వేలు చిక్కిందని బాధితుడు రాఘవయ్య వెల్లడించారు. ‘ఎమ్మెల్యేకు సమస్యలు చెబుదామని వెడితే..  నేను అక్కడ ఉంటే  చెంచిరెడ్డి దుర్భాషలాడి అనుచరులతో పక్కకు గెంటేయించారు. నన్ను స్టేషన్కు తీసుకు వెళ్లాలని  కానిస్టేబుళ్లకు  సూచించారు. ఆతర్వాత ఎస్ఐ సిబ్బంది కొట్టారు’  అని వాపోయారు.  

ఈ సంఘటనపై ఎస్ఐ శ్రీకాంత్ వద్ద ప్రస్తావించగా గంగవరంలో రాఘవయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారని,  దీనిపై ఎమ్మెల్యే ఇచ్చిన సమాచారంతో ఆయనను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి మందలించామని తెలిపారు. తాము అతడిని కొట్ట లేదని స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!