తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే: రాయలసీమ లిఫ్ట్‌పై ఏపీ మంత్రి పేర్ని నాని

By narsimha lode  |  First Published Jun 25, 2021, 2:44 PM IST

: కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే ఉందని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. 


అమరావతి: కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమే ఉందని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. శుక్రవారం నాడు అమరావతిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. కృష్ణానది జలాల వివాదంపై  తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. 

also read:రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అక్రమమే: వేముల ప్రశాంత్ రెడ్డి

Latest Videos

 రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టినా, మరో ప్రాజెక్టు ప్రతిపాదించినా కూడ తమ రాష్ట్రానికి కేటాయించిన కేటాయింపుల కంటే ఒక్క చుక్క కూడ అదనంగా వాడుకోవడం లేదని ఆయన చెప్పారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా ఎంతో మేలు చేశారన్నారు. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. ఉద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తమ వాటా కంటే గ్లాసు నీళ్లు కూడ  వాడబోమని ఆయన స్పష్టం చేశారు.తాము ఎవరితో కూడ తగాదాలు కోరుకోవడం లేదని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం వైఎస్ఆర్ గురించి తెలంగాణ మంత్రులు చెడుగా మాట్లాడుతున్నారని  ఆయన మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ది కోసం కేంద్రప్రభుత్వంతో సామరస్యంగా ఉంటున్నామన్నారు.

click me!