ఏపీలో పరిషత్ ఎన్నికలు: సింగిల్ జడ్జి ఉత్తర్వుపై డివిజన్ బెంచ్ స్టే

By narsimha lode  |  First Published Jun 25, 2021, 2:20 PM IST

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్  స్టే ఇచ్చింది.  సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం  ఆశ్రయించింది.
 



అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్  స్టే ఇచ్చింది.  సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ లో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం  ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం సవాల్ చేసింది. ఎన్నికల సంఘం పిటిషన్ పై ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇవాళ విచారణ నిర్వహించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై స్టే ఇచ్చింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్.

also read:పరిషత్ ఎన్నికల రద్దు: సింగిల్ బెంచ్ తీర్పుపై... డివిజన్ బెంచ్‌లో ఏపీ ఎస్ఈసీ పిటిషన్

Latest Videos

undefined

ఎన్నికల రిట్ అప్పీల్ తేలవరకు ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 7వ తేదీకి వాయిదా వేసింది.ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ ఏడాది మే 21న సింగిల్ జడ్జి రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించ లేదని కోర్టు అభిప్రాయపడింది. పరిషత్ ఎన్నికలను నిర్వహించడాన్ని నిర్వహిస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పిటిషన్లు దాఖలు చేశాయి.  

doing పేర్నినాని

click me!