ఏపీలో తగ్గని కరోనా తీవ్రత.. 24 గంటల్లో 13474 కేసులు, కడప జిల్లాలో అత్యథికం

Siva Kodati |  
Published : Jan 27, 2022, 07:40 PM IST
ఏపీలో తగ్గని కరోనా తీవ్రత.. 24 గంటల్లో 13474 కేసులు, కడప జిల్లాలో అత్యథికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,474 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,33,152కి చేరుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,474 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 22,33,152కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,579కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 10,290 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 21,09,080కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 41,771 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,23,25,140కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,09,493 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 980, చిత్తూరు 328, తూర్పుగోదావరి 1066, గుంటూరు 1342, కడప 2031, కృష్ణ 873, కర్నూలు 1835, నెల్లూరు 1007, ప్రకాశం 1259, శ్రీకాకుళం 259, విశాఖపట్నం 1349, విజయనగరం 469, పశ్చిమ గోదావరిలలో 676 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు భారత్‌లో కరోనా వైరస్ (Coronavirus) విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. కిందటి రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,03,71,500కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 573 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల (Corona deaths) సంఖ్య 4,91,700కి చేరింది. 

తాజాగా కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,76,77,328కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22,02,472 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా..  దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 19.59 శాతంగా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేట్ 17.75 శాతంగా ఉంది. ఇక, దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతం, యాక్టివ్ కేసులు.. 5.46 శాతం, మరణాలు.. 1.22 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 

దేశంలో నిన్న(జనవరి 26) 14,62,261 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటివరకు దేశంలో 72,21,66,248 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 22,35,267 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,63,84,39,207కి చేరింది. 

 

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu