మధ్యతరగతి ప్రజలకు జగనన్న స్మార్ట్ ఇళ్ల నిర్మాణం: ఏపీ మంత్రి పేర్నినాని

By narsimha lode  |  First Published Jun 30, 2021, 5:00 PM IST

రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ పరిధిలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని  కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. 


అమరావతి: రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ పరిధిలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని  కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని ఇవాళ మీడియాకు వివరించారు. జూలై 8వ తేదీన వైఎస్ఆర్  జయంతిని పురస్కరించుకొని రైతు దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. గిట్టుబాటు ధరలేని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని మంత్రి చెప్పారు.అనకాపల్లిలో బెల్లం ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు మంత్రి. మచిలీపట్నంలో అక్వా పరిశ్రమ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

also read:కేసీఆర్ సర్కార్ పై ప్రధానికి ఫిర్యాదు... జలవివాదంపై అమీతుమీకి సిద్దమైన జగన్

Latest Videos

వైఎస్ఆర్   భీమా పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. జూలై 1,3, 4 తేదీల్లో పేదల ఇళ్ల పథకానికి శంకుస్థాపనలు చేయాలని  కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 17 వేల కొత్త కాలనీలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.గిట్టుబాటు ధరలేని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నామని   మంత్రి చెప్పారు.కొత్త ఐటీ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనా విషయంలో రాష్ట్రం అనుసరించిన విధానాలు మంచి ఫలితాలు అవలంభించాయని ఆయన చెప్పారు.ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు.

మధ్యతరగతి ప్రజలకు ఇళ్లను నిర్మించేందుకు గాను జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్ ఏర్పాటు చేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల్లో లేఔట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. 150, 200, 240 గజాల్లో ఇళ్ల స్థలాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నామని ఆయన తెలిపారు. లాభాపేక్ష లేకుండా వాస్తవ ఖర్చుతో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొందన్నారు మంత్రి.

click me!