వినాయకచవితి: కాణిపాకం వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి

By narsimha lodeFirst Published Sep 10, 2021, 9:44 AM IST
Highlights

కాణిపాకం వినాయకుడికి ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారంనాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. వినాయకచవితిని పురస్కరించుకొని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ఆలయ అధికారులు  భక్తులను కోరారు.

చిత్తూరు:చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ది వినాయకుడికి ఏపీ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం నాడు పట్టువస్త్రాలను సమర్పించారు.వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని కుటుంబసభ్యులతో కలిసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాణిపాకం వినాయకుడిని ఇవాళ దర్శించుకొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆలయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఎస్. బాబు  స్వాగతం పలికారు.

వినాయకచవితిని పురస్కరించుకొని కరోనా నిబంధనలను పాటిస్తూ స్వామిని భక్తులు దర్శించుకొన్నారు. వినాయకచవితిని పురస్కరించుకొని  కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలని  ఆలయ అధికారులు భక్తులకు సూచించారు.

వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.వినాయకచవితి పర్వదినం  రోజునే కాకుండా సాధారణ రోజుల్లో కూడ ఈ ఆలయానికి  పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

 

 


 

click me!