చంద్రబాబు వద్ద పిచ్చి కుక్కలు, ఊరకుక్కలుంటాయి: మంత్రి కొడాలి నాని

Published : Sep 10, 2020, 12:39 PM IST
చంద్రబాబు వద్ద పిచ్చి కుక్కలు, ఊరకుక్కలుంటాయి: మంత్రి కొడాలి నాని

సారాంశం

చంద్రబాబు వద్ద పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు ఉంటాయని ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.  గురువారం నాడు ఏపీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు

అమరావతి: చంద్రబాబు వద్ద పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు ఉంటాయని ఏపీ రాష్ట్ర మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
గురువారం నాడు ఏపీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పనిపాటలేని వర్ల రామయ్య పనికిమాలినవాడన్నారు. చంద్రబాబు చిల్లర పనులను తాను నిక్కర్లు వేసినప్పటి నుండి చూస్తున్నానని ఆయన మండిపడ్డారు. 

తాను తన పొలాల రేట్ల కోసం ఉద్యమం చేయడం లేదన్నారు.  తాను తన పొలాల రేట్లు పెరగాలని కోరుకోవడం లేదని ఆయన పరోక్షంగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకురావడం విడ్డూరమని మంత్రి కొడాలి నాని ఈ నెల 8వ తేదీన వ్యాఖ్యానించారు. పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

పేదలకు ఇళ్ల పట్టాలను అమరావతిలో ఇవ్వకపోతే  ఇక్కడ శాసన రాజధాని అవసరం లేదని కూడ ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో కూడ చర్చించినట్టుగా మంత్రి కొడాలి నాని ప్రకటించి సంచలనం సృష్టించారు.

టీడీపీ నేతలపై ఏపీ మంత్రి కొడాలినాని చేస్తున్న విమర్శలపై  టీడీపీ నేతలు వర్ల రామయ్య, టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు అర్జునుడులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu