జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ దుష్ట్ప్రచారం చేస్తుందని ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శించారు.శవ రాజకీయాలకు టీడీపీ తెర తీసిందన్నారు.
అమరావతి: ప్రభుత్వంపై TDP నేతలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani చెప్పారు.మంగళవారం నాడు ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కొడాలి నాని మీడీయాతో మాట్లాడారు.Jangareddy Gudem Mystery deaths పై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని చూస్తున్నారని టీడీపీపై మంత్రి నాని మండిపడ్డారు. శవాలపై చిల్లర ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై ఫైరయ్యారు. సాధారణ మరణాలను మద్యం మరణాలుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి విమర్శించారు. ఈ నెల మూడో తేదిన చనిపోతే ఇప్పుడు రాద్దాంతం చేస్తున్నారని మంత్రి ఫైరయ్యారు.
జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ కోసం టీడీపీ సభ్యులు అసెంబ్లీలో పట్టు బడ్డారు. నిన్న అసెంబ్లీ నుండి ఐదు సభ్యులు సెషన్ మొత్తం సస్పెండ్ అయ్యారు. ఇవాళ కూడా టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ఇవాళ కూడా సీెఎం జగన్ టీడీపీ సభ్యుల తీరును తప్పు బట్టారు. ఇవాళ సభ నుండి 11 మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు.
జంగారెడ్డి గూడెంలో ఇటీవల కాలంలో మరణించిన కుటుంబ సభ్యులను టీడీపీ చీఫ్ చంద్రబాబు సోమవారం నాడు పరామర్శించారు. ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెంలో వరుసగా మరణాలు చోటు చేసుకొన్నాయి. అయితే వరుస మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకొన్న మరణాలకు పలు కారణాలున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మద్యం సేవించడం వల్ల మరణాలు కూడా చోటు చేసుకొన్నాయనే ప్రచారం కూడా లేకపోలేదు.
ఈ విషయమై ఏపీ అసెంబ్లీలో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిలు ప్రకటన చేశారు. సహజ మరణాలను కూడా టీడీపీ వక్రీకరిస్తుందని మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ప్రభుత్వం విమర్శించింది.
ఈ మరణాలపై దర్యాప్తు నిర్వహించడానికి పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ హైమావతి విజయవాడ జీజీహెచ్ డాక్టర్ల టీమ్ జంగారెడ్డి గూడెంలో విచారణ నిర్వహించింది.. మృతుల కుటుంబాల ఇళ్లకు ఈ టీం వెళ్లింది. మృతుల కుటుంబాల నుండి వివరాలు సేకరించింది. ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. మృతి చెందిన వారిలో ఇందులో ముగ్గురికి మాత్రం మందు తాగే అలవాటు ఉందని చెప్పారు. ఇందులో పలువురు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఉన్నారని తెలిపారు. మరి కొందరు 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నరని పేర్కొన్నారు.
ఈ మరణాల నేపథ్యంలో పలువురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. గురువారం ఒకరు హాస్పిట్ లకు వెళ్లిన కొంత సమయానికి మృతి చెందారు. అయితే ఆయన మృతదేహానికి పోస్టు మార్టం చేయలేదు. ఇలా మృతి చెందిన వారెవరికీ పోస్టు మార్టం నిర్వహించలేదు. దీంతో అసలు మరణాలు ఏ కారణంతో సంభవిస్తున్నాయనే అంశంపై ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. అయితే కల్తీ సారా విక్రయిస్తున్నారనే కుటుంబ సభ్యులు తెలిపడంతో అధికారులు పలు చోట్ల దాడులు నిర్వహించారు. దీంతో పాటు పలు చోట్ల హెల్త్ క్యాంప్ లు చేపడుతున్నారు.