అధికార దాహం వల్లే కందుకూరులో ఎనిమిది మంది మృతి: బాబుపై మంత్రి కాకాని ఫైర్

By narsimha lode  |  First Published Dec 29, 2022, 10:50 AM IST

కందుకూరు చంద్రబాబు రోడ్ షో లో  ఎనిమిది మంది  మృతి చెందిన ఘటనపై  కేసు నమోదు చేయాలని  ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి  డిమాండ్  చేశారు. 


నెల్లూరు: చంద్రబాబు అధికార దాహం వల్లే కందుకూరు ప్రమాదం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి  విమర్శించారు. ఈ ఘటనపై  చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని  ఆయన డిమాండ్  చేశారు. గురువారంనాడు ఆయన నెల్లూరులో  మీడియాతో మాట్లాడారు. లేనిది ఉన్నట్టు చూపే ప్రయత్నం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన  ఆరోపించారు. చంద్రబాబునాయుడు సీఎంగా  ఉన్నప్పుడు  పుష్కరఘాట్ లో   29 మంది మృతికి కారణమయ్యారన్నారని ఆయన గుర్తు చేశారు. 

 పెద్ద రోడ్లను వదిలేసి  ఇరుకుగా ఉండే ఎన్టీఆర్ సర్కిల్ లో రోడ్ షో ఏర్పాటు చేశారని  మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.. ఈ ప్రమాదం జరిగిన  ప్రాంతానికి  సమీపంలోనే  ఆసుపత్రి ఉండడంతో వైద్య సహయం త్వరగా అందిందన్నారు.చంద్రబాబునాయుడు  ప్రచార యావ  ప్రజలకు శాపంగా మారిందన్నారు. చంద్రబాబుకు ఉన్న ప్రచారపిచ్చి  సామాన్యులను బలిగొందని  మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.డ్రోన్ షాట్స్ కోసం  చంద్రబాబునాయుడు ఎనిమిది మంది ప్రాణాలను  బలి తీసుకున్నారని మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి  చెప్పారు.  రెండు పక్కల ఫ్లెక్సీలు  పెట్టి  ఇరుకు సంధులో  జనాన్ని  తీసుకువచ్చారన్నారు. ఇరుకు స్థలం వల్లే  తొక్కిసలాట జరిగిందని  మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి  చెప్పారు. కందుకూరులో  చంద్రబాబునాయుడు ఎనిమిది మందిని హత్య చేశారని  ఆయన ఆరోపించారు.ఈ  రోడ్ షోకు  స్థానికులు  రాకపోవడంతో  చంద్రబాబునాయుడు  తనతో పాటు  జనాన్ని తీసుకువచ్చారని  మంత్రి విమర్శించారు.  

Latest Videos

undefined

also read:చంద్రబాబు కందుకూరు రోడ్‌షోలో తొక్కిసలాటపై కేసు: మృతులు వీరే....

  ఎనిమిది మంది మృతికి  కారణమైన చంద్రబాబు  ఆ కుటుంబాలకు   సహాయం చేయడాన్ని  ఆయనకు బాకా ఊదే  మీడియా ఆకాశానికి ఎత్తడాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తప్పుబట్టారు.పేదల ప్రాణాలకు  చంద్రబాబు వెల కడుతున్నారని మంత్రి  మండిపడ్డారు.  చంద్రబాబునాయుడు ప్రజలకు ఏం చేశారని జనం వస్తారని  మంత్రి ప్రశ్నించారు.  అధికారంలో  ఉన్న రోజుల్లో పేదలకు  చంద్రబాబు ఏం చేశారని  ఆయన అడిగారు.  చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రంలో  పుట్టడమే ఖర్మ అని  ఆయన పేర్కొన్నారు. జగన్ సభలకు లక్షలాది మంది  వచ్చినా ఎక్కడా  కూడా ఒక అపశృతి కూడా జరగలేదని  మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 

click me!