చంద్రబాబు కందుకూరు రోడ్‌షోలో తొక్కిసలాటపై కేసు: మృతులు వీరే....

By narsimha lode  |  First Published Dec 29, 2022, 9:38 AM IST

నెల్లూరు జిల్లా కందుకూరులో   బుధవారంనాడు  రాత్రి చంద్రబాబు సభ వద్ద  జరిగిన  తొక్కిసలాటపై  పోలీసులు కేసు నమోదు చేశారు. 174 సెక్షన్ కింద  కేసు నమోదు చేసి  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


నెల్లూరు: నెల్లూరు జిల్లా కందుకూరులో  బుధవారం నాడు  రాత్రి చంద్రబాబు సభ వద్ద  జరిగిన తొక్కిసలాటపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  174 సెక్షన్ కింద  కేసు పెట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు. ఈ ప్రమాదానికి  కారణాలపై  పోలీసులు ఆరా తీయనున్నారు.  

ఈ ఘటనలో  మొత్తం  ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడ ఉన్నారు.  మృతదేహలకు  గురువారం నాడు ఉదయం పోస్టుమార్టం  పూర్తైంది.  పోస్టుమార్టం  పూర్తైన మృతదేహలను  ప్రత్యేక అంబులెన్స్ లలో  స్వగ్రామాలకు  తరలించారు.  మృతి చెందిన ఎనిమిది మంది  పార్టీ కార్యకర్తల అంత్యక్రియలు నిర్వహించాలని  టీడీపీ నిర్ణయించింది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  ఇంకా కందుకూరులోనే  ఉన్నారు.  ఈ ఘటనలో  మృతి చెందిన  పార్టీ శ్రేణుల అంత్యక్రియలు పూర్తయ్యేవరకు  పార్టీ నేతలు ఆయా గ్రామాల్లోనే ఉండాలని చంద్రబాబు సూచించారు.   మృతి చెందిన  టీడీపీ కార్యకర్తల  కుటుంబాలకు  పార్టీ తరపున రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందిచనున్నట్టుగా  చంద్రబాబునాయుడు  ప్రకటించారు. మృతుల కుటుంబాల పిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటామని  చంద్రబాబు ప్రకటించారు.  మరోవైపు   ఈ ప్రమాదంపై  ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు  ఆర్ధిక సహాయం ప్రకటించారు. 

Latest Videos

undefined

మృతుల వివరాలివే

గుడ్లూరు మండలం అమ్మవారి పాలెంకు  చెందిన  చిన కొండయ్య,  కందుకూరు మండలం  గుర్రంవారిపాలెంకు  చెందిన  కాకుమాని రాజా, ఉలవపాడు మండలం ఆత్మకూరు చెందిన దేవినేని రవీంద్రబాబు,ఉలవపాడు  మండలం  ఒరుగుసేవపాలెంకు  చెందిన యాటగిరి విజయ, కందుకూరు మండలం  కొండముడుసు పాలెంకు  చెందిన   కందకకూరి యాదాద్రి , గూడ్లూరు మండలం గుళ్లపాలెంకు  చెందిన యు. పురుషోత్తం, కందుకూరు మండలం  ఓగూరుకు చెందిన  గడ్డం మధుబాబు, కందుకూరుకు చెందిన రాజేశ్వరి లు ఈ ఘటనలో  మృతి చెందారు.  

click me!