సామాజిక న్యాయంపై అసెంబ్లీలో చర్చకు సిద్దమా: చంద్రబాబుకు మంత్రి జోగు రమేష్ సవాల్

By narsimha lode  |  First Published Feb 24, 2023, 5:39 PM IST

బీసీలను  బలవంతులు  చేసిన ఘనత ఏపీ సీఎం వైఎస్  జగన్ కే దక్కుతుందని  ఏపీ మంత్రి  జోగి రమేష్  చెప్పారు. 


అమరావతి: సామాజిక న్యాయంపై  అసెంబ్లీలో  చర్చకు సిద్దమా అని   టీడీపీ చీఫ్ చంద్రబాబుకు  ఏపీ మంత్రి జోగి రమేష్  సవాల్  విసిరారు. శుక్రవారం నాడు ఏపీ మంత్రి జోగి రమేష్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు.  32 పథకాలతో  సీఎం జగన్ ప్రజల మన్ననలను  పొందారని  ఆయన  చెప్పారు.  సంక్షేమం ఎలా ఉంటుందో  ప్రజలకు చేసి చూపించినట్టుగా  ఆయన తెలిపారు. సామాజిక న్యాయం  ఏమిటో  చేసి చూపించామన్నారు.  త్వరలో జరిగే  అసెంబ్లీ సమావేశాల్లో సామాజిక  న్యాయంపై  చర్చకు  సిద్దమా అని  ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. అసెంబ్లీకి వస్తే  ఏ విషయంపైనైనా చర్చకు తాము సిద్దంగా  ఉన్నామన్నారు.  

also read:జగన్ రాడు.. నేనూ, వంశీ రెడీ .. రాజీనామా చేసి రా.. కొట్టుకుందాం : చంద్రబాబుకు కొడాలి నాని సవాల్

Latest Videos

బీసీలను బానిసలుగా  మార్చాడని  మంత్రి జోగి రమేష్ విమర్శించారు.   బీసీలను  జగన్  బలవంతులు చేశాడన్నారు.  బీసీల్లోని  అన్ని కులాలకు  పదవులను ఇచ్చారన్నారు.   చంద్రబాబునాయుడు  అధికారంలో  ఉన్న  సమయంలో  బీసీలకు  ఏం  చేశాడు, తమ ప్రభుత్వం  ఏం చేసిందో   చర్చకు తాము సిద్దంగా  ఉన్నామని జీగి రమేష్ చెప్పారు. బాలకృష్ణ డైలాగ్ లు రాసిస్తే  లోకేష్  మాట్లాడుతున్నారని  ఆయన విమర్శించారు. నక్కకు, నాగలోకానికి  ఉన్నంత తేడా  లోకేష్ కి , జగన్ కు మధ్య  ఉందన్నారు . 

click me!