టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శుక్రవారం నాడు పోలీసులు కోరారు.
విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శుక్రవారం నాడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో ఘర్షణల నేపథ్యంలో టీడీపీ నేత పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 20వ తేదీన గన్నవరంలో టీడీపీ, వల్లభనేని వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ కార్యాలయంపై వంశీ వర్గీయులు దాడి చేశారు. టీడీపీ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. పార్టీ కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పు పెట్టారు.
undefined
గన్నవరంంలో ఘర్షణలకు పట్టాభి కారణమని జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కేసులో పట్టాభిని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. పట్టాబిని విచారిస్తే ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
also read:గన్నవరంలో పట్టాభికి ఏం పని.. ఘర్షణల వెనుక చంద్రబాబు హస్తం : మోపిదేవి వెంకట రమణ వ్యాఖ్యలు
గన్నవరంలో ఘర్షణలపై టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో గన్నవరం నుండి వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్ధిగా విజయం సాధించారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీ టీడీపీని వీడి వైసీపీకి మద్దతు ప్రకటించారు. వంశీ టీడీపీని వీడిన తర్వాత గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య ఉప్పు, నిప్పు మాదిరిగా పరిస్థితి మారింది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ పై వంశీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై గన్నవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు.