జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదు: మంత్రి జవహర్ ధ్వజం

Published : Jan 28, 2019, 06:21 PM IST
జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదు: మంత్రి జవహర్ ధ్వజం

సారాంశం

సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జగన్ నవరత్నాలు... నకిలీ రత్నాలు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదంటూ విమర్శించారు. అయినా జగన్ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని చెప్పారు.   

ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు నవరత్నాలు కాదని నకిలీ రత్నాలంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబుపై వైసీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జవహర్ మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదంటూ విమర్శించారు. 

వైసీపీ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని స్పష్టం చేశారు. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు చంద్రబాబు వెనుకే ఉన్నారని వివరించారు. బీసీ సదస్సు చూసి జగన్ వెన్నులో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. 
 
సీఎం చంద్రబాబుపై వైసీపీ నేతల దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జగన్ నవరత్నాలు... నకిలీ రత్నాలు అంటూ ఎద్దేవా చేశారు. జగన్ సీఎం అయ్యేది లేదు, చేసేది లేదంటూ విమర్శించారు. అయినా జగన్ పథకాలను కాపీ కొట్టాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని చెప్పారు. 

బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు చంద్రబాబు వెనుకే ఉన్నారని వివరించారు. బీసీ సదస్సు చూసి జగన్ వెన్నులో వణుకు మొదలైందని వ్యాఖ్యానించారు. బీజేపీ నేత పురంధీశ్వరికీ సీఎం చంద్రబాబునాయుడే టార్గెట్ అన్నారు. 
 
పురంధీశ్వరి బీజేపీలో ఉంటే తనయుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరతారని ఈ చేరికలు చూస్తుంటే బీజేపీ-వైసీపీల మధ్య చీకటి ఒప్పందం తెలుస్తుందని మంత్రి జవహర్ విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు