సీఎం ఎక్కడుంటే అదే రాజధాని: ఏపీ మంత్రి గౌతం రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Aug 31, 2021, 2:52 PM IST

ఏపీ రాజధానిపై ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఎక్కడుంటే అక్కడే రాజధాని అని ఆయన తేల్చి చెప్పారు. సీఎం నివాసం ఎక్కడుంటే అక్కడే సెక్రటేరియట్, అదే రాజధాని ఆయన తేల్చి చెప్పారు.



చిత్తూరు: సీఎం జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడుంటే అదే రాజధాని అనుకోవాలని  ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు  ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీఎం ఉన్న చోటే రాజధాని అనుకోవాలని అది పులివెందుల కావచ్చు విజయవాడ కావచ్చు  రేపు మరో ప్రాంతం కావచ్చన్నారు.

 సీఎం నివాసం ఎక్కడ ఉంటే అక్కడే సెక్రటేరియెట్ అదే రాజధాని అని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సీఎం జగన్ నిర్ణయానికి తామంతా కట్టుబడి ఉన్నామన్నారు. 

Latest Videos

ఏపీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. అమరావతిని శాసనసరాజధాని, కర్నూల్ ను న్యాయ రాజధాని,విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ అమరావతి వాసులు ఆందోళనలు చేస్తున్నారు. అంతేకాదు వారంతా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పటిషన్లపై విచారణ నవంబర్ 15కి వాయిదా పడింది.
 

click me!