ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ: హాజరు కాని అచ్చెన్న, కూన రవికుమార్, కమిటీ సీరియస్

By narsimha lode  |  First Published Aug 31, 2021, 1:22 PM IST


ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ హాజరు కాలేదు. వ్యక్తిగత కారాణాలతో హాజరు కాలేనని  టీడీపీ శాసనసభ పక్ష ఉప నాయకుడు  అచ్చెన్నాయుడు సమాచారం పంపారు. సెప్టెంబర్ 14వ తేదీన మరోసారి సమావేశం కావాలని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం తీసుకొంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశానికి  టీడీపీ శాసనసభపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు హాజరు కాలేదు. ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ కి కూడ  అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగత కారణాలతో ఈ సమావేశానికి హాజరు కాలేనని అచ్చెన్నాయుడు ప్రివిలేజ్ కమిటీకి సమాచారం పంపాడు. 

కూన రవికుమార్ మాత్రం ప్రివిలేజ్ కమిటీకి ఎలాంటి సమాచారం పంపలేదు. దీంతో  ప్రివిలేజ్ కమిటీ కూన రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. సెప్టెంబర్ 14వ తేదీన  ప్రివిలేజ్ కమిటీ సమావేశం మరోసారి సమావేశం కానుంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో ప్రివిలేజ్ కమిటీ  టీడీపీ నేతలకు నోటీసులు పంపింది.వచ్చే నేెల 14 వ తేదీన నిర్వహించే సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని మరోసారి నేతలను ప్రవివేజ్ కమిటీ ఆదేశించినట్టుగా సమాచారం. 

Latest Videos

undefined

ప్రివిలేజ్ కమిటీకి హాజరు కాకపోవడం కోర్టు ధిక్కారమేనని సమావేశం అభిప్రాయపడింది. మరో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు తనపై ఆరోపణలకు సంబంధించి సమాచారం పంపితే సమాధానం ఇస్తానని ప్రివిలేజ్ కమిటీని కోరారు. దీంతో ఆయనకు సమాచారం పంపాలని  కమిటీ నిర్ణయం తీసుకొంది. కూన రవికుమార్  వ్యవహరశైలిని సమావేశం తప్పుబట్టింది. వచ్చే సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మెన్ కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

 

click me!