వాలంటీర్లపైనే తుపాకీ పేలుస్తారు: చంద్రబాబుపై మంత్రి ధర్మాన

Published : Feb 06, 2023, 01:58 PM IST
 వాలంటీర్లపైనే తుపాకీ పేలుస్తారు: చంద్రబాబుపై  మంత్రి ధర్మాన

సారాంశం

చంద్రబాబు పై ఏపీ మంత్రి  ధర్మాన ప్రసాదరావు  విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే  తొలుత  తుపాకీ పేల్చేది  వాలంటీర్లపైనేనన్నారు.   

శ్రీకాకుళం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే  తొలుత తుపాకీ పేల్చేది  వాలంటీర్లపైనేనని  ఏపీ మంత్రి  ధర్మాన ప్రసాదరావు  చెప్పారు.  సోమవారం నాడు  శ్రీకాకుళం జిల్లాలో  జరిగిన కార్యక్రమంలో  ఆయన  మాట్లాడారు.  అందుకే  చంద్రబాబు కంటే  ముందే  మనం తుపాకీని పేల్చాలని   మంత్రి ధర్మాన ప్రసాదరావు  తెలిపారు.  ఏది మంచి ప్రభుత్వమో  చెప్పే హక్కు వాలంటీర్లకు  ఉందని  మంత్రి  అభిప్రాయపడ్డారు. 

అధికారంలోకి రావడానికి  చంద్రబాబునాయుడు ఏదో ఒకటి చేస్తాడన్నారు.   ఈ విషయమై  అప్రమత్తంగా  ఉండాల్సిన అవసరం ఉందని  చెప్పారు. ప్రజల మధ్యలో  పాలన వేరన్నారు. సినిమాల్లో యాక్షన్ వేరని  ఆయన  తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వాలంటీర్ల వ్యవస్థను  ప్రవేశ పెట్టింది. వాలంటీర్లపై  విపక్ష పార్టీలు  విమర్శలు చేశాయి. వైసీపీ  కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకున్నారని   విపక్షాలు ఆరోపణలు  చేశాయి.  

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలు   నేరుగా లబ్దిదారుల ఇంటికి  చేర్చడంలో  వాలంటీర్లు  కీలకంగా వ్యవహరిస్తున్నారు.  చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా  ఉన్న సమయంలో జన్మభూమి కమిటీలుండేవి.  ఈ కమిటీలపై అప్పట్లో విపక్షాలు విమర్శలు  చేశాయి. . వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వాలంటీర్లను ప్రవేశ పెట్టింది. 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations