భావనపాడు పోర్టు విస్తరణతో పాటు కీలకాంశాలకు కేబినెట్ ఆమోదం: మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్

By narsimha lode  |  First Published Sep 7, 2022, 5:24 PM IST

ఏపీ కేబినెట్ ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.భావనపాడు పోర్టు విస్తరణతో పాటు పాణ్యంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతించినట్టుగా మంత్రి వేణుగోపాల్ చెప్పారు.


అమరావతి: భావనపాడు పోర్టు విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపిందని ఏపీ సమాచార  శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ చెప్పారు.ఏపీకేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి వేణుగోపాల్ మీడియాకు వివరించారు.అమరావతిలో బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

సచివాలయంలోని పలు శాఖల్లో 85 అదనపు పోస్టులకు భర్తీకి  కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు నంద్యాల జిల్లాలోని పాణ్యంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కురుపాం ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీలో సిబ్బంది నియామకానికి కూడా పచ్చజెండా ఊపినట్టుగా మంత్రి వివరించారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నామన్నారు.

Latest Videos

undefined

వైఎస్ఆర్ చేయూత ద్వారా మహిళల ఖాతాల్లోకి రూ. 4700 కోట్లు జమ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నెల 22 నుండి వారం రోజుల పాటు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్నినిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. 

also read:ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. 8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్‌లు, లోక్‌ అదాలత్‌‌ల ఏర్పాటుకు ఆమోదం

ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలకు  కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు మంత్రి. రోడ్లు భవనాల శఆఖలో ఆర్కిటెక్ట్ విభాగంలో ఎనిమిది పోస్టుల ను మంజూరు చేసినట్టుగా మంత్రి చెప్పారు. సైడిపాలెం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. ఈ నెల 5వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు  సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 1లక్షా 25 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని మంత్రి వేణుగోపాల్ చెప్పారు.  ఈ పెట్టుబడులతో ప్రత్యక్షంగా 40 వేల మందికి , పరోక్షఁంగా 60 వేల మందికి ఉపాధి లభ్యం కానుందని మంత్రి వివరించారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా 175 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న వారికి క్షమాభిక్ష పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వీరికితోడుగా మరో 20 మంది క్షమాభిక్ష కల్పించేందుకు కేబినెట్  అనుమతించిందని మంత్రి వివరించారు.

నాలుగు జిల్లాల్లో శాశ్వత లోక్ అదాలత్ ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ కోర్టుల్లో 40 మంది సిబ్బంది నియామకానికి  మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.చిత్తూరు జిల్లా పేరూర్ లో  కన్వెన్షన్ సెంటర్, రిసార్ట్స్ నిర్మాణానికి అవసరమైన 32 ఎకరాల  భూమిని ఒబెరాయ్ గ్రూప్ నకు  కేటాయించినిట్టుగా మంత్రి వివరించారు. శ్రీకాకుళంలో,ని వెన్నెలవలసలో పశుసంవర్ధక శాఖ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు 30 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు.అల్లూరు సీతారామరాజు జిల్లాలో చింతూరు కేంద్రంగా రెవిన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు. 

లిక్కర్ లైసెన్సులు ఎవరిచ్చారు: చంద్రబాబుపై మంత్రి ఫైర్ 

లిక్కర్ లైసెన్సులు ఎవరి కాలంలో వచ్చాయని మంత్రి వేణుగోపాల్ ప్రశ్నించారు. వైఎస్ భారతి లిక్కర్ స్కాంలో ఉన్నారని  టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్టుగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. అపద్ధర్మ సీఎంగా ఉండి లిక్కర్ లైసెన్సులు ఇచ్చిన నీచ చరిత్ర చంద్రబాబుదని మంత్రి వేణుగోపాల్ విమర్శించారు.తన భార్యను ఏదో అన్నారని చంద్రబాబు భోరున ఏడ్చారన్నారు. సీఎం జగన్ విసయంలో ప్రతిష్టను దెబ్బతీసేలా విమర్శలు చేస్తున్నారన్నారు. అపద్ధర్మ  సీఎంగా ఉంటూ  లిక్కర్ లైసెన్సులు ఇచ్చారని ఆయన విమర్శించారు.


 


 

click me!