లిక్కర్ స్కామ్‌లో పాత్రధారులు, సూత్రధారులు ఈ ముగ్గురే : రఘురామ సంచలన ఆరోపణలు

By Siva KodatiFirst Published Sep 7, 2022, 5:18 PM IST
Highlights

లిక్కర్ స్కామ్‌లో రోహిత్ రెడ్డి, పినాక శరత్ చంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడు సూత్రధారులని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని.. అడాన్ డిస్టిలరీకి రూ.200 కోట్ల బ్యాంక్ గ్యారెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు.
 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కామ్‌లో రోహిత్ రెడ్డి, పినాక శరత్ చంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అల్లుడు సూత్రధారులని ఆరోపించారు. అన్నా క్యాంటీన్‌లను కూల్చేస్తున్నట్లుగానే చంద్రబాబు ఇచ్చిన డిస్టిలరీని కూడా కూల్చేయవచ్చు కదా అంటూ రఘురామ ప్రశ్నించారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని.. అడాన్ డిస్టిలరీకి రూ.200 కోట్ల బ్యాంక్ గ్యారెంట్ ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ కుంభకోణం ఏదో ఒకరోజు బయటపడుతుందని రఘురామ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేయడం లేదని, లిక్కర్‌పై వచ్చే డబ్బును ఎక్కడకు తీసుకెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని రఘురామ స్పష్టం చేశారు. 

ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రలకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అని చెప్పిన సీఎం జగన్.. తమకేం పట్టదని మంత్రులు వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తున్న ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. విపక్షాలు ఆరోపణలు చేస్తున్న కొందరు మంత్రులు స్పందించడం లేదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా  ప్రస్తావించినట్టుగా మీడియాలో ప్రచారం జరుగుతుంది. 

ALso REad:ఆయన విజయసాయిరెడ్డి కాదు.. బ్రోకర్ రెడ్డి, ఢిల్లీలో అలానే పిలుస్తారు : రఘురామ వ్యాఖ్యలు

కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసినా స్పందించరా అని మంత్రులను సీఎం జగన్ ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, వాటి అనుకూల మీడియా చేసే అసత్య ప్రచారాన్ని మంత్రులు తప్పనిసరిగా తిప్పికొట్టాలని స్పష్టం  చేశారు. తీరు మారకంటే మరోసారి కేబినెట్‌లో మార్పులు చేయమంటారా? అని సీఎం జగన్ హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. రెండు నెలల సమయం ఇస్తున్నానని తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే ఇద్దరు, ముగ్గురు మంత్రులను తొలగించడానికి కూడా వెనకాడనని సీఎం జగన్ మంత్రులకు గట్టిగానే చెప్పినట్టుగా సమాచారం. అయితే ఇద్దరు, ముగ్గురు మంత్రులు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టడానికి దూరంగా ఉండటంతోనే సీఎం జగన్ ఈ విధమైన హెచ్చరికలు జారీచేసినట్టుగా తెలుస్తోంది. 

click me!