అమిత్ షాతో భేటీ.. పురందేశ్వరి, లోకేష్ కలిసి వెళ్లారో.. విడి విడిగా వెళ్లారో : బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

By Siva Kodati  |  First Published Oct 12, 2023, 6:33 PM IST

పురందేశ్వరి , లోకేష్ కలిసి అమిత్ షా దగ్గరికి  వెళ్లారో, విడివిడిగా వెళ్లారోనంటూ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు .  ఏపీ బీజేపీ .. టీడీపీకి బీ టీమ్ అని ఆయన ఆరోపించారు . విద్యాశాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. అటు చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్‌తో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పురందేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది. కేంద్ర పెద్దల ద్వారా తన మరిదిని బయటకు తీసుకొచ్చేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా అమిత్ షాతో పురందేశ్వరి భేటీపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 

ఏపీ బీజేపీ .. టీడీపీకి బీ టీమ్ అని ఆయన ఆరోపించారు. పురందేశ్వరి , లోకేష్ కలిసి వెళ్లారో, విడివిడిగా వెళ్లారోనంటూ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బీజేపీకి చెప్పి చేయాల్సిన అవసరం మాకేముందని ఆయన ప్రశ్నించారు. అమిత్ షాను కలిసి వారిద్దరూ బాధలు చెప్పుకుని వుంటారని బొత్స వ్యాఖ్యానించారు. 

Latest Videos

Also Read: అమిత్ షా కలవాలని అనుకుంటున్నట్టు కిషన్‌రెడ్డి ఫోన్.. ఆ విషయం స్పష్టం చేశారు: లోకేష్ కీలక వ్యాఖ్యలు

అలాగే విద్యాశాఖపై విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు అందించేది అంతా ఉచిత కంటెంటేనని తెలిపారు. బైజూస్‌కు తాము ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదని బొత్స స్పష్టం చేశారు. ఆ సంస్థ ఇచ్చిన కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు 5 లక్షలకు పైగా ట్యాబ్స్ అందించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో అందజేసే ట్యాబ్స్‌లో 8, 9, 10వ తరగతులకు సంబంధించిన కంటెంట్ వేసి ఇస్తామని మంత్రి వెల్లడించారు. 
 

click me!